1, సెప్టెంబర్ 2024, ఆదివారం

 జాతక చక్రంలో పితృదోషం

*పితృదోషం వలన కలిగే ప్రభావాలు**


*పితృదోషం ఉన్న వ్యక్తి తన గోత్రమును కొనసాగించడటానికి పుత్ర సంతానం కలుగకపోవడం*


*పితృదోషం ఉన్న వారు అసలు సంతానం కలుగకపోవడం*


*పితృదోషం ఉన్న వ్యక్తికి తరచు అబార్షన్ జరగటం*


*సోదర సోదరీ మణుల మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం*


*పితృదోషం ఉన్న వారి యొక్క పుత్రుడు ఎటువంటి కారణం లేకుండా విద్యను లేక ఉద్యోగాన్ని మధ్యలోనే అర్థాంతరంగా ఆపేయడం జరుగుతుంది*


*పితృదోషం ఉన్న వారి యొక్క సంతానం వివాహం చేసుకునేందుకు అంగీకరించకపోవడం, ప్రేమలో పడి పెద్దల మాట వినక దారి తప్పడం జరుగుతుంది*


*పితృదోషం ఉన్న వారు వివాహం చేసుకోవడానికి తగిన వారు దొరక్కపోవడం*


*పితృదోషం ఉన్న వ్యక్తికి శారీరక పరంగా, సామాజిక పరంగా గాని ఇబ్బందులు, పెళ్ళి ఆగిపోవడం, సంతానం లేకపోవడం జరుగుతుంది*


*పితృదోషం ఉన్న వారు సంతానం అతి చిన్న వయసులోనే మధ్యానికి, ఇతరా డ్రగ్స్ కి అలవాటు పడటం జరుగుతుంది*


*పితృదోషం ఉన్న వారు సంతానానికి వివాహం జరుగక ముందే లేక వివాహం జరిగి వారసులకు జన్మనివ్వక ముందే గతించడం జరుగుతుంది*


*పితృదోషం ఉన్న వారు శారీరకంగా మానసికంగా దౌర్భల్యం కలిగిన పరిస్థితి లో ఉంటారు, శారీరక మానసిక వైకల్యం ఉన్న సంతానానికి జన్మ ఇవ్వడం జరుగుతుంది*


*పితృదోషం ఉన్న వారి యొక్క ఇంట్లో తరచూ పాలు పొంగి పోవడం, కొత్త గోడలకు తొందరగా చీలికలు పగుళ్ళు రావడం, తరచు ఇంట్లో గొడవలు, చిన్న చిన్న వాటికే పెద్ద స్థాయిలో గొడవలు, మొదలైనవి తరచు జరుగుతూ ఉంటాయి*


*పితృదోషం ఉన్న వారి యొక్క వ్యాపారంలో అప్పులు, నష్టములు కలుగటం జరుగుతుంది*


*పితృదోషం ఉన్న వారు తరచూ ఉద్యోగాలు మారడం లేక ఉద్యోగమే లేకపోవడం జరుగుతుంది*


*పితృదోషం ఉన్న వారి యొక్క సంతానం పెద్దవారిని గౌరవించక, అతి దురుసుగా మాట్లాడటం, తీవ్ర ప్రవర్తన జరుగుతుంది*

*పితృదోష ఉన్న వారు తప్పక పాటించాల్సిన నియమాలు**



*పని మీద బయటకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి*



*గతించిన పితృలకు సాంప్రదాయ పద్ధతిలో శ్రార్థ కర్మ, తర్పణాలు చేయాలి*



*గతంలో చేసిన పాప కర్మలకు తగిన విధంగా ప్రాయశ్చిత్తం తెలుసుకోవాలి*



*శారీరక లేక మానసిక దుర్భలం ఉన్నవారికి అనాథలకు సంపాదనలో  కొంతైనా దానం చేయగలరు*



*కుటుంబంతో మరియు సోదర సోదరీ మణుల తో అన్యోన్యత పాటించాలి*



*దైవానుగ్రహం మరియు పూర్వీకుల ఆశీర్వాదం కోసం తగిన విధంగా జపాలు, పేదింటి అమ్మాయి యొక్క వివాహ భాధ్యత తీసుకోవాలి*



*ఇంకా కొన్ని అంశాలు పెద్ద వారిని సంప్రదించి తగిన విధంగా పరిష్కార మార్గాలను చేయాల్సిన అవసరం ఉంది* పితృ శాపం, దేవతా శాపం, చనిపోయిన వారి కర్మకాండలలో చేసిన పొరపాట్లు, ఉంటే తర్పణాలు, బ్రాహ్మణ భోజనం, నాగబలి మొదలైనవి కూడా ఉంటాయి**