29, జనవరి 2015, గురువారం

ది 30.01.2015 భీమైకాదశి, భీష్మైకాదశి. భీష్ముడు పుట్టినది ఈ రోజే. భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకు ఉపదేశించాడు కాబట్టి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్లయితే అనంత పుణ్యం వస్తుందని తిథి తత్త్వము అనే గ్రంథం వివరిస్తోంది. కనీసం విష్ణు సహస్రనామంలోని ఈ ఒక్క శ్లోకమైనా చదువుకుంటే మంచిది.
                        శ్లో           శ్రీరామ రామేతి రమే రామే మనోరమే
                                       సహస్రమాన తత్తుల్యం రామ నామ వరాననే.

26, జనవరి 2015, సోమవారం

రేపు అనగా ది 27.01.2015 భీష్మాష్టమి. అనగా భీష్ముడు నిర్యాణం చెందిన రోజు.ఈ రోజున భీష్మునికి తిలాంజలి ఇచ్చిన వారికి సంతాన లేకపోయినట్లయితే సంతానం కలుగుతుందని స్మృతి కౌస్తుభం అనే గ్రంధం చెబుతోంది. భీష్మునికి తర్పణం చేసినట్లయితే సంవత్సర పాపం నశిస్తుందని కూడా పురణాలు చెబుతున్నాయి.