18, సెప్టెంబర్ 2022, ఆదివారం

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

 

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.  

 

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.


పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.


ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.


ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.


చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.  


బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో  ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.  


బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.



4, సెప్టెంబర్ 2022, ఆదివారం

బాలారిష్ట దోషం - పరిహారాలు

 పిల్లలు పుట్టిన వెంటనే జన్మనక్షత్రం ప్రకారం దోషం ఉన్నదా? జన్మలగ్నం దశాత్ ఏమైనా దోషములు ఉన్నాయా? అనేది పరిశీలించడం ఒక ఆనవాయితీ. అలా ఎందుకు చేయాలి.

జనన కాలమునకు గండ నక్షత్రములు అని పేరుతో కొన్ని నక్షత్రాలు చెప్పారు కదా. ‘అశ్విన్యాది చతుష్కంచ పుష్య ప్రభృతి పంచకం; రాధేంద్ర భాతి త్రితయం పూర్వాభాద్రా చరేవతీ చిత్తార్ర్దా బహు దోషంస్సాత్ పితృ మాతృ హానిం వదేత్’ అని వున్నది. ప్రతి పంచాంగంలోను ఉదహరిస్తున్నారు. ఆ పట్టికను ఆధారంగా ఏ నక్షత్ర పాదంలో పుడితే తల్లికి గండము, ఎందులో పుడితే తండ్రికి గండము అనే అంశాలు మనం తెలుసుకొని నక్షత్ర శాంతి చేయించుకొని ముందుకు వెళ్లాలి.

వైదిక సంప్రదాయంలో ఏ నక్షత్రంలో పిల్లలు పుట్టినా ‘ముభావ లోకనం’ (నూనెలో ముఖం చూచుట) శిశువును ప్రథమతః నూనెలో ముఖం చూచి తరువాతనే ప్రత్యక్షంగా చూడడం శ్రేయస్కరం అని పెద్దల వాదన. శాస్త్రాన్ని అనుసరిద్దాం అనే ఉద్దేశం వున్నప్పుడు వేద విహితమైన వైదిక మార్గానికి పెద్ద పీట వేయవలసిందే.

ఇక జన్మలగ్నాత్ చాంద్రాష్టమంచ ధరణీ సుతస్సప్తమంచ రాహుర్నవంచ శని జన్మ గురున్తృపతీయే అర్కస్తు పంచ భృగుషట్క బుధశ్చతుర్దే కేతో వ్యయోస్తు బాలారిష్టానాం’ అని ఎక్కువ వాడకంలో వున్న సూత్రం. జన్మ లగ్నము నుండి అష్టమంలో చంద్రుడు వున్ననూ, కుజుడు సప్తమంలో వున్ననూ, రాహువు నవమంలో వున్ననూ, జన్మంలో శని వున్ననూ, గురువు తృతీయంలో వున్ననూ, రవి పంచమంలో వున్ననూ, శుక్రుడు ఆరవ యింట వున్ననూ, బుధుడు చతుర్ధంలో వున్ననూ, కేతువు వ్యయంలో వున్ననూ బాలారిష్టములుగా చెబుతారు.

పరాశరుల సిద్ధాంతం ప్రకారం మరియు ఇతర గ్రంథకర్తల వ్యాసములు ఆధారంగా 12వ సంవత్సరం వరకు ఈ బాలారిష్టములు ఉంటాయి. అంతేకాకుండా పితృ మాతృ పూర్వ జన్మల ఫలితంగానే ఈ బాలారిష్టములు కూడా అందిస్తాయి. అష్టమాధిపతి దశ అయినను అష్టమంలో వున్న గ్రహం యొక్క దశ అయినను ప్రారంభంలో వస్తే ప్రమాదమే. అలాగే లగ్నంలో షష్ట్ధాపతి, షష్ఠంలో లగ్నాధిపతి, ఇదే రీతిగా లగ్న వ్యయాధిపతుల విషయంలో కూడా చర్చనీయాంశ ప్రమాదకర అంశాలు ఉంటాయి. అందువలన ఆయా బాలారిష్టముల విషయములు మరియు గండ నక్షత్ర విషయములు ముందుగానే శోధింప చేసుకొని తగిన శాంతి మార్గములు వెదికి చేయించుట శ్రేయస్కరము.

బాలారిష్టములు ఇచ్చే గ్రహముల దశలు అంతర్దశలు 12వ సంవత్సరం వయసులోపుగా కనుక వస్తే అది ఇంకా ప్రమాదమే. అప్పుడు బహు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే బాలారిష్టములు వున్న శిశువుకు 12వ సంవత్సరం వరకు తరచుగా ఆరోగ్య సమస్యలు రావడం పెద్దల శోధనల వలన వెల్లడి అవుతోంది. గండ నక్షత్ర శాంతి బాలారిష్ట శాంతి విధానములు వైదిక మార్గంలో నిష్ణాతులయిన పండితుల ద్వారా తెలుసుకోవాలి. ఎలాంటి జాతకంలో పుట్టినా నామకరణం రోజు నక్షత్ర హోమం, నవగ్రహ హోమం చేయించడం సర్వదా శ్రేయస్కరం.


27, ఆగస్టు 2022, శనివారం

వినాయకుడ 8 ముఖ్యమైన పేర్లు , వాటి వివరణ

👉 వక్రతుండుడు :-   

పూర్వం ఇంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల ‘మాత్సర్యాసురుడు’ అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలూ అల్లాడిపోసాగాయి. అతన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ఉపాయమూ తోచక దేవతలంతా దత్తాత్రేయుని శరణు వేడారు. అంతట దత్తాత్రేయుడు, గణపతిని ప్రార్థించమని సూచించాడు. ‘గం’ అనే బీజాక్షరంతో దేవతలంతా ఆ గణపతిని గురించి తపస్సు చేయగానే ‘వక్రతుండుని’గా అవతరించాడు. ఆయన సింహవాహనుడై ఆ మాత్సర్యాసురుని జయించాడు. వక్రతుండం అనేది ఓంకారానికి ప్రతీకగా, మాత్సర్యాసురుడు మనలోని మత్సరానికి (ఈర్ష్య) ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ లోకం నాది, ఈ లోకంలో అందరికంటే నాదే పైచేయి కావాలి అనుకున్న రోజున ఈర్ష్యాసూయలు జనిస్తాయి. కానీ సృష్టి లీలావిలాసంలో ఈ జగత్తు ఒక నాటకం మాత్రమే అని గ్రహించిన రోజున మనసులో ఎలాంటి ఈర్ష్యా ఉండదు. ఇదే మాత్సర్యం మీద ఓంకారపు విజయం.


👉ఏకదంతుడు :–  

చ్యవనుడనే రుషి మదాసురుడనే రాక్షసుని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడేమో అతనికి ‘హ్రీం’ అనే మంత్రాన్ని ఉపదేశించి, దాన్ని నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందన్న ఉపాయాన్ని అందించాడు. లోకాధిపత్యమే అభీష్టంగా కల మదాసురుడు ఆ హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి కోరుకున్న శక్తులన్నీ లభించాయి. అసలే రాక్షసుడు, ఆపై అతీత శక్తులు... ఇక మదాసురునికి తిరుగు లేకుండా పోయింది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లిపోయి సనత్కుమారుని చెంతకు ఉపాయం కోసం పరుగులుతీశారు. సనత్కుమారుని సూచన మేరకు వారంతా గణేశుని కోసం ప్రార్థించగా, ఆయన ‘ఏకదంతు’నిగా అవతరించి మదాసురిని జయించాడు. ఇక్కడ మదాసురుడు అంటే మదానికి (గర్వం) చిహ్నం, ఏకదంతుడు ఈ సృష్టి యవత్తూ ఒకటే అన్న అద్వైతానికి చిహ్నం. ఆ అద్వైత రహస్యం తెలిసిన రోజున మదం అణిగిపోక తప్పదుగా!


👉మహోదరుడు :–   

శివుడు ఓసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంతకాలమైనా ఆయన ఆ తపస్సుని వీడనే లేదయ్యే! దాంతో పార్వతి కంగారుపడిపోయింది. ఎలాగైనా ఆ పరమేశ్వరుని తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంది. ఒక గిరిజన యువతిగా మారి ఆయన తపోభంగం కలిగించే ప్రయత్నం చేసింది. పార్వతి చేష్టలకు పరమేశ్వరునికి దిగ్గున మెలకువ వచ్చింది. ఆ మెలకువతో పాటుగా ఏం జరిగింది అన్న అయోమయం కూడా ఏర్పడింది. ఆ అయోమయం నుంచి ఓ రాక్షసుడు జనించాడు. అతనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్యుని ఆరాధించి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు లంబోదరునిగా అవతరించాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. దృక్పథం సంకుచితంగా మారిపోతుంది. అందరూ నావారే అన్న విశాలమైన దృష్టి కలిగిన రోజున ఆ మోహం దూరమైపోతుంది. మనంలో మోహానికి సూచనగా మోహాసురుడు, విశాలమైన దృక్పథానికి సూచనగా లంబోదరుడు నిలుస్తారు.


👉గజాననుడు :–   

కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివపంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు, శివుని అనుగ్రహంతో ముల్లోకాలనూ జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి అంతులేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే రుషిని శరణువేడారు. గణపతిని కనుక ఆవాహన చేస్తే, లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు రైభ్యుడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు ‘గజాననుడి’గా అవతరించి లోభాసురుని జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచిస్తుంది. ఆ బుద్ధిని కనుక ఉపయోగిస్తే మనలోని లోభం (అత్యాశ, పిసినారితనం) దూరం కాక తప్పవు. ఇతే లోభాసురుని పరాజయంలో ఉన్న సందేశం.

లంబోదరుడు – దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే! ఈ అమృతాన్ని రాక్షసులకు కాకుండా చేసేందుకు, విష్ణుమూర్తి మోహినీ అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చలించిందట. కానీ ఎప్పుడైతే విష్ణువు తన నిజరూపంలోకి వచ్చాడో... శివుడు భంగపడి క్రోధితుడయ్యాడు. ఆ క్రోధం నుంచే క్రోధాసురుడు అనే రాక్షసుడు జనించాడు. ఆ క్రోధాసురుడు సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు. క్రోధాసురుడు, ప్రీతి అనే కన్యను వివాహమాడాడు. వారికి హర్షం, శోకం అనే సంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడూ తాను ఇష్టపడిన (ప్రీతి) దాని కోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. ఇదే లంబోదర వృత్తాంతంలోని అంతరార్థం.


👉వికటుడు – 

పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతట ఆ రుషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక ఆ గణేశుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షం అయ్యాడు. గణేశుని రూపు కాస్త విభిన్నంగా ఉంటుంది. అది ఒకోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్ని ఎదుర్కోవచ్చుననీ వికటుని వృత్తాంతం తెలియచేస్తోంది.


👉విఘ్నరాజు – 

కామ, క్రోధ, మోహ, లోబ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటివరకూ రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడు అనే రాక్షసుని కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలనూ పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు, విఘ్నరాజుగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగపాముని వాహనంగా చేసుకొన్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి కల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగ వాహనం కనిపిస్తాయి.


👉ధూమ్రవర్ణుడు – 

అరిషడ్వర్గాలు అయిపోయాయి, దేహాభిమానమూ తీరిపోయింది. ఇక ‘నేను’ అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు, ఒక పరిమితీ ఉండదు. సర్వవ్యాపి అయిన ఆ భగవంతునికి ప్రతిరూపం ధూమ్రం. మనిషి ‘తాను’ అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం.

13, ఆగస్టు 2022, శనివారం

జప విధి విధానాలు

మంత్రం అంటే 'మ' మననము చేసేవారిని  'త్ర' త్రాణము కాపాడేది అని అర్థం! జపం అంటె  'జ' జన్మ విఛ్ఛేదము చేసేది !  'ప' పాపాలను నశింప చేసేది అని అర్థం. మంత్ర జపం వలన మన శరీరంలో నాడీస్పందనము కలిగి, మహాశక్తి ఉద్భవిస్తుంది. శరీరానికి ఉత్తేజం కలిగి, బుద్ది వికసిస్తుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. జన్మార్జిత పాపాలన్ని నశిస్తాయి.

ముందుగా గురువు నుంచి మంత్ర దీక్ష పొంది. శుచిగా,ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని , ఏకాగ్రతతో, భక్తి శ్రద్ధలతో మంత్రాన్ని జపం చేయాలి. కాస్టాసనమున కూర్చుని జపం చేస్తే దుఃఖం,ఋణబాధ కలుగుతుంది. రాతిపై కూర్చుని జపం చేస్తే వ్యాధి సంభవిస్తుంది. ధర్మాసనం పై కూర్చుని జపం చేస్తే వశీకరణం, పాపనాశనం, రోగవిముక్తి, వస్త్రం పై కూర్చుని జపం చేస్తే దారిద్ర్యం.  ''కృష్ణాజినే జ్ఞానసిద్ది ర్మోక్షసీ వ్యాఘ్రచర్మణే, కుశాసనే యోగసిద్ది స్సర్వస్ద్యస్తు కంబళే '' అని శాస్త్ర వచనం! ధర్భాసనం ,చిత్రాసనం పీటపై వేసుకొని జపం చేయడం మంచిది....

||అంగుష్ఠేతు మోక్షార్థీ తర్జనీ ధనవర్థనీ మధ్యమాంగుళ్యం విధ్యార్థీ మరణం అనామికం తథా కనిష్ఠా కర్షణం చైవ ఇత్యైతే జపలక్షణమ్ ||

జపం చేసేటప్పుడు చేతికొనలతో లెక్కిస్తే ఏకగుణ ఫలితం,వ్రేళ్ళ కణుపులతో లెక్కిస్తే దశగుణ ఫలితం. ఉంగరపు వేలు మధ్యకణుపు మొదలుకొని ప్రదక్షిణంగా అన్ని వ్రేళ్ళ కొనలమీదగా చూపుడు వేలు మూలము వరకు లెక్కించిన పది అవుతుంది. ఇలా కణుపుల ద్వారా లెక్కించడం మంచిది. శంఖములు, మణులు కలిగిన మాలతో జపం చేస్తే దాని ఫలితం శతగుణం! పగడపు మాలతో జపం చేస్తే సహస్ర ఫలం! ముత్యాల మాలతో జపం చేస్తే పది లక్షల రెట్లు ఎక్కువ ఫలితం. స్పటిక మాల జపం పది లక్షల రెట్లు ఫలితం. తులసీ మాల, రుద్రాక్ష మాల, దర్భగ్రంథులతో చేసిన జపం చాలా ఫలదాయకం . 

సాధకులు స్థిరంగా, సుఖాసనం లో ప్రశాంతంగా కూర్చుని నిటారుగా కూర్చొని, మంత్రం బయిటకు వినబడకుండా జపం చేయాలి. జప మాలను వస్త్రం తో మూసివేయాలి. 

ప్రతీ రోజూ విధిగా మంత్రోపాసన చేసే వారు నిత్యజపానికి ఒక శాశ్వత ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం మంచిది. ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఆ గది కూడా చీకటిగా ఉండటం,పూజా సామాగ్రి తప్ప మరో వస్తువు లేకుండా ఉంటే చాలా మంచిది. ప్రతీ వీలైనంత వరకు ఒకే సమయంలో జపానికి కూర్చోవడం ఉత్తమ ఫలితాలు ఉంటాయి.

6, ఆగస్టు 2022, శనివారం

శిశుజననము - నక్షత్రాలు

పిల్లలు జన్మించినప్పుడు వెంటనే పుట్టిన నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది. ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ దోషములు కలుగు తాయి దోష పరిహారములు ఏమిటి ? దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవ గ్రహ శాంతి, హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభిషేకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి.

1. అశ్విని:- 1 వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము ౩ నెలలు ఉండును. ఇక్కడ గమనించ వలసిన విషయము రేవతి, అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిముషములు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు.

2. భరణీ:- 1 2 4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును.

3. కృత్తిక నక్షత్రములో:- 3 వ పాదము లో జన్మంచిన స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగ చేయును. 1 2 4 పాదములలో జన్మంచిన వారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు.

4. రోహిణి నక్షత్రము:- 1 వ పాదములో జన్మించిన మేనమామకు, 2 వ పాదము తండ్రికి, ౩వ పాదము తల్లికి దోషమని 4 వ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము. సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టిన వలన మేనమామకు గండము. తప్పక శాంతి అవసరము . శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు . అందు వలెనే కంసుడు నాశనమయ్యాడనీ పురాణ వచనము.

5. మృగశిర:- 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు.

6. ఆరుద్ర నక్షత్రము:- 1 2 3 పాదములలో జన్మంచిన వారికి దోషము లేదు 4 వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము.

7. పునర్వసు నక్షత్రము:- 1 2 3 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.

8. పుష్యమి నక్షత్రము:- కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును. రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. పుష్యమి నక్షత్రము లో జన్మించిన వారివలన 1 వ పాదము మేనమామలకు 2 పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు . మూడు, నాలగవ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును . వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి . గంధపు చెక్కను దానము ఇచ్చుట వలన దోషము నశించును.

9. ఆశ్లేష నక్షత్రములో:- 1 వ పాదమున పుట్టినవారికి దోషము లేదు. 2 వ పాదము శిశువునకు 3 వ పాదము తల్లికి 4 వ పాదము తండ్రికి దోషము . నాలుగవ పాదము న జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును.

10. మఖ నక్షత్రము:- 1 వ పాదములో జనన మైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్ర్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము . ౩ వ పాదము న పుట్టిన వారి వలన తల్లి తండ్రి ఇద్దరకి దోషము . అశ్వము దానమిచ్చుట వలన దోషము తొలగును . 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు.

11. పుబ్బ నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

12. ఉత్తర నక్షత్రము:- 1, 4 వ పాదములలో జననము జరిగిన యెడల తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. నూనె పాత్రను దానము చెయ్యాలి. మిగతా 2 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు.

13. హస్తా నక్షత్రము:- 3 వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1 2 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

14. చిత్త నక్షత్రము:- 1 వ పాదము తండ్రికి, 2 వ పాదము తల్లికి 3 వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును.

15 స్వాతి నక్షత్రము:- 1 2 3 4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు.

16 విశాఖనక్షత్రము:- జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును . 1 2 3 4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము. విశేష శాంతి అవసరము.

17. అనూరాధ నక్షత్రము:- 1 2 3 4 పాదముల లో జన్మించుట వలన దోషము లేదు.

18 . జ్యేష్ట నక్షత్రము:- ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1 2 3 4 ఏ పాదములో జన్మించినా దోషమే. జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి . అందు ఏ భాగములో పుడితే ఆ భాగ సంభందము కలవారికి తప్పక దోషం కలుగును. 1 వ భాగములో తాతయ్యకు 2 అమ్మమ్మ కు ౩ తల్లి తోడ బుట్టిన వారికి , మేనమామలకు 4 అన్నలకు, అక్కలకు 5 శిశువునకు 6 ఎవ్వరికి దోషము ఉండదు 7 వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు 8 జాతకునకు 9 తల్లికి 10 తండ్రికి దోషము కలుగ చేయును. మరియు నాల్గవ పాదమున జనన మైతే తండ్రికి దోషము . ఇది సమారు 9 నెలలు ఉండును . గోవు ను దానము ఇచ్చుట వలన శాంతి కలుగును. విశేష శాంతి చేయించాలి .

19. మూల నక్షత్రము:- ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండను. ఈ నక్షత్రము లో 1 వ పాదమున జనన మయిన వారి తండ్రికి, 2 వ పాదము తల్లికి, ౩ వ పాదము ధనమునకు నాశనము కల్గించును 4 వ పాదమున జననము జరిగిన దోషము లేదు . మూలా నక్షత్ర సమయమును మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసు కోవాలి.

పన్నెండు భాగాలలో 1 వ భాగము తండ్రికి దోషము 2 తల్లికి ౩ అన్నలకు 4 భాగస్వాములకు 5 పిల్లనిచ్చిన మామగారికి 6 చిన్నాన్న, పెద్ద నాన్నలకు 7 పిన్నమ్మ , పెద్దమ్మ లకు మరియు మేనమామలకు 8 ధనమునకు 9 జీవన నాశనము 10 దరిద్రమును కల్గిస్తుంది 11 భ్రుత్యులు 12 జాతకునికి నాశనము కలుగ చేయును.

*జ్యేష్ట ,మూలా నక్షత్రములలో* జన్మించిన వారి దోషము వివాహ కాలము వరకు ఉండును . దోష నివారణ కొరకు నవ గ్రహ శాంతి, జప, తప, దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును.

20 పూర్వాషాడ నక్షత్రము:- పగటి వేళలో కుమారుడు జన్మించినపుడు తండ్రికి ఆపదలు కలుగును. 2 3 వ పాదములలో స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టిననూ తల్లి తండ్రి ఇద్దరికీ గండము . 4 వ పాదమున జననము దోషము లేదు .

21 ఉత్తరాషాడ నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .

22 శ్రవణం నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .

23 ధనిష్ట నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .

24 శతభిషం నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు .

25 పూర్వాబాద్ర నక్షత్రము:- 1 2 3 పాదములలో జననము దోషము లేదు . నాల్గవ పాదము సామాన్య దోషము .

26 ఉత్తరాభాద్ర నక్షత్రము:- 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

27 రేవతి నక్షత్రము:- 1 2 3 పాదములలో జననము దోషము లేదు . 4 వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి. 

27, జులై 2022, బుధవారం

రేపు చుక్కల అమావాస్య 28.07.2022

ఆషాఢమాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య గురించి చాలామంది విని ఉండరు. కానీ ఆ రోజున పితృదేవతలను తల్చుకున్నా , గౌరీవ్రతం చేసినా , దీపపూజ నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే...
 
హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో , జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే , కర్క సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. అదే చుక్కల అమావాస్య. 

ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు , దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా , వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట !
 
ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం . కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ , మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. ఇందుకోసం పసుపుముద్దని గౌరీదేవిగా భావించి , ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.
 
ఈ అమావాస్య రోజున అవివాహితలే కాదు... కొత్త కోడళ్లు కూడా *‘చుక్కల అమావాస్య’* పేరుతో ఒక నోముని నోచుకుంటారట. ఇందుకోసం గౌరీపూజని చేసి , సందెవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి , ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము మొదలై ఉండవచ్చు. తమ మాంగళ్యం కల’కాలం’ ఉండాలన్నదే ముత్తయిదువుల కోరిక కదా !
 
ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. అషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి , చలి మొదలవుతుంది. చలి , చీకటి అనేవి అజ్ఞానానికి , బద్ధకానికీ , అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని , వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి , వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. 

మనం అంతగా పట్టించుకోని చుక్కల అమావాస్య వెనకాల ఇన్ని తతంగాలు ఉన్నాయన్నమాట.

శ్రావణ మాసం దాని విశిష్టత

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. 

శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రవణా నక్షత్రం" అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం. 

శ్రావణ మాసంలోని  మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. 

శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు.


మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు 
శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని,సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. 

మంగళగౌరీ వ్రతం
శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను. 

వరలక్ష్మీ వ్రతం
మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణమాసంలో వచ్చే పండగలు

శుక్లచవితి-నాగులచవితి
మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి 

ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ - రాఖీపూర్ణిమ

సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ - హయగ్రీవ జయంతి
వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం.హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు. 

కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి 
క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు. 

కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి
శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య
ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

26, జులై 2022, మంగళవారం

త్రివిధ నవమి

ప్రవేశాన్నిర్గమం తస్మాత్ప్రవే శంనవమేతిధౌ
నక్షత్రేపి తధావారే నైవ కుర్యాత్క దాచన
ప్రవేశాన్నిర్గమశ్చైవ నిర్గ మాచ్చ ప్రవేశనం
నవమే జాతునో కుర్యాద్ది నేవారే తిధావపి (ముహూర్త చింతామణి, గర్గ వచనం)

ప్రయాణ నవమి, ప్రవేశ నవమి ప్రత్యక్ష నవమి అని నవమి మూడు రకాలు.

ఇంటికి వచ్చిన తరువాత తొమ్మిదవ రోజు తిరిగి ప్రయాణం చేయరాదు. దీన్ని ప్రయాణ నవమి అని అంటారు.

ప్రయాణం ప్రారంభించిన రోజు నుండి తొమ్మిదవ రోజు ఇంటికి రాకూడదు దీనిని ప్రవేశ నవమి అని అంటారు.

నవమి తిధిని ప్రత్యక్ష నవమి అని కూడా అంటారు. దీనిలో ప్రయాణం చేయరాదు.

ప్రయాణ నవమి విషయంలో విశేషం ఉంది. ప్రయాణం చేసి తిరిగి వచ్చిన తరువాత ఇంట్లో ప్రవేశించిన తిధికి తొమ్మిదవ తిధి, ప్రవేశించిన నక్షత్రానికి తొమ్మిదవ నక్షత్రం, ప్రవేశించిన వారానికి తొమ్మిదవ వారం కూడా నిషిద్ధాలు.

ప్రయాణం చేసి తిరిగి వచ్చి గృహంలో ప్రవేశించిన రోజు నుండి తొమ్మిదవ రోజున, తొమ్మిదవ వారం రోజున, తొమ్మిదవ తేదీ లోను మరల ప్రయాణం చేయకూడదు.

అలాగే ప్రయాణమై వెళ్లిన రోజుకు తొమ్మిదవ రోజు తొమ్మిదవ తిధి, తొమ్మిదవ వారం నాడు ఇంట్లో ప్రవేశించి రాదు

24, జులై 2022, ఆదివారం

వివాహ లగ్నము వాటి దోషములు


   శ్లో:- లగ్నాదష్టమగః కుజోనిధనకృద్భౌమాష్టమాఖ్యోప్యయం
          యద్యేవం భృగుషట్కదోష ఇతి తల్లగ్నాత్ భృగుష్షష్ఠగః
          యుద్దే శత్రుజితౌ రిపోర్గృహగతౌ నీచస్థితౌ చాస్తగౌ
          తౌద్వౌ దుర్బలినౌ వదంతిచపరే దోషస్తునా స్తీత్యహో
తాత్పర్యము:- వివాహ లగ్నమునకు కుజుడు 8వ యింట ఉండరాదు. దానిని కుజాష్టదోషమందురు. దానివలన మృత్యువు సంభవించును. శుక్రుడు 6వ యింట నున్న భృగుషట్కమని మహాదోషము. మృత్యుప్రదమగునది యగును. కుజ, శుక్రులు నిర్జితులై. నీచయందుగాని, శత్రుక్షేత్రములందు గాని యున్నచో, నస్తంగతులైనచో మంచిదని కొందరి మతము. అది కూడినంత మంచిది కాదని గ్రంథకర్త యభిప్రాయము.
     కర్తరి (కత్తెర) దోష నిర్ణయము
    శ్లో:- లగ్నాద్ద్వాదశగోభవేదృజుగతి ర్వక్రీద్వితీయస్థితః
          పాపౌద్వౌయది మథ్యలగ్నముభయోర్మృత్యు ప్రదాకర్తరీ
          చంద్రోవా యది మధ్యగస్తదుభయో రన్యేజగుఃకర్తరీ
          తౌద్వేవా నచకర్తరీ హ్యృజుగతీ తద్వ్యత్యయౌవక్రిణౌ
తాత్పర్యము:- నిశ్చిత లగ్నమునందు 2 పాపగ్రహములుండి, అందొకటి 12వ యింట మరియొకటి 2వ యింటయుండి 12 నందలి గ్రహము యధావిధిగా యుండి, 2వ యింట నున్న పాపగ్రహము వక్రించినచో ఆ రెంటినడుమదైన లగ్నమునకు కర్తరీ దోషము కలుగును. ఇది మరణకారణమగును. అట్టి కర్తిరీ దోశసమయమున పాపగ్రహో భయమునడుమ. చంద్రుడుండెనేని అది అధిక కర్తరీ దోషమని కొందరందరు. ఉపరుక్తములైన పాపగ్రహద్వయము రెండునూ వక్రించియున్నప్పుడూ, వక్రత వీడియున్నప్పుడూ, 2వ యింట గ్రహము సజావుగా నుండి 12వ యింట గ్రహము మాత్రమే వక్రించి యున్నప్పుడూ లగ్నమునకీ కర్తరీ దోషము లేదని చెప్పబడుచున్నది.
     వివాహ లగ్నాష్టమ దోషనిర్ణయము
    శ్లో:- త్యాజ్యంచాష్టమలగ్న మేవజననాల్లగ్నాచ్చ రాశేస్తయోః
          దంపత్యోరపి మృత్యుకృత్తదథి లగ్నస్థితో వాతయోః
          చంద్రోప్యష్టమరాశిగః తదుభయోర్నిత్యం దరిద్రప్రద
          స్త్స్యాజ్యం ద్వాదశలగ్నమష్యశుభకృత్తజ్జన్మ లగ్నంగృహమ్
తాత్పర్యము:- జన్మలగ్నమునకు జన్మ కాల చంద్రరాశికి అష్టమ లగ్నము విశేష నష్టదాయకము. అది యెంత శాస్త్రోక్తమైన సద్గుణములతో నున్ననూ విడిచిపెట్టుట ముఖ్యము. అష్టమలగ్నాధిపతి వివాహలగ్నాధిపతి వివాహలగ్నమందుండినచో దంపతులకు కీడు గల్గును. జన్మరాశికి అష్టమమందు చంద్రుడున్న దరిద్రము నిచ్చును. జన్మలగ్నమును జన్మ సంబంధ ద్వాదశలగ్నము పనిచేయవు. పెండ్లిండ్లలో యా లగ్నమందు ముహూర్తము పెట్టిన దంపతులకు హాని కలిగించును.
      శేష దోషములు
    శ్లో:- లగ్నాద్ద్వాదశగేథవా రిపుగతే చంద్రేష్టమస్థే తదా
           రిప్ఫాష్టారిగ చంద్ర నామకమహోదోషస్తయోర్మృత్యుకృత్
           దోష స్సగ్రహనామకో నిధనకృచ్చంద్రే గ్రహేణాన్వితే
           దోషోనేతి పరేజగు శ్శశధరే సౌమ్య గ్రహేణాన్వితే
తాత్పర్యము:- చంద్రుడు శుభలగ్నమునకు షష్ఠస్థానమందుగాని, యష్టమమందుగాని, ద్వాదశస్థానమందుగాని, యున్నచో అది దోషముగా నెరిగి యట్టి ముహూర్తము లుంచరాదు. చంద్రునకు యితర గ్రహముల సంబంధమున్న సగ్రహ దోషమందురు. చంద్రుడు శుభులతో గూడిన దోషిగా నిర్ణయించనక్కరలేదు.
     సగ్రహ చంద్రదోషము
   శ్లో:- దారిద్ర్యం మరణం త్వపత్యరహితం దౌర్భాగ్యమేవంస్త్రియా
         స్సాపత్న్యంయతిభావమేవకలహందుఃఖంచకుర్యాత్క్రమాత్
         ఉద్వాహాదిషు చంద్ర ఏకభవనే సూర్యాదిఖేటైర్యుతో
         నక్షత్రాంతరగ శ్శుభోయది సశీత్యన్యే జగుర్నేతరే
తాత్పర్యము:- వివాహ మొనరించు లగ్నములలో చంద్రునితో రవి కలిసిన దరిద్రము సంభవించును. కుజుడు కలిసినచో మరణము, బుధునితో కూడిన గొడ్రాలితనము, గురుడు కలిసిన  దౌర్భాగ్యము శుక్రుడైన సవతి ప్రవేశించును. శనియున్న దంపతులకు సంపదలుండవు. రాహువున్న కలహము వచ్చును. కేతువున్నచో దుఃఖభాద గల్గించును. యభిమతము యిట్లున్నది. చంద్రుడితో కలిసిన గ్రహము చంద్రుడున్న నక్షత్రములో నుండకున్నను లేక నక్షత్రపాదములు వ్యత్యయములుగా నున్నను దోషమంటదని అందురు.

నామ నక్షత్రం తెలుసుకునే పద్దతి

 జ్యోతిష ఫలితాలకొరకు సాధారణంగా నక్షత్రాలను పరిశీలుస్తుంటారు.. ఎవరిది ఏ నక్షత్రము. ఏరాశి అని అడుగు తుంటారు. ఎవరిది ఏ నక్షత్రమో తెలుసుకోడానికి రెండు పద్దతులున్నాయి.

1. జన్మ నక్షత్రము. 2. నామ నక్షత్రము. జన్మ నక్షత్రం అనగా పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని తెలుసు కోవడము. పేరును బట్టి నక్షత్రాన్ని తెలుసుకోవడము. రెండింటిలో ఏది ప్రధానము అనే విషయానికొస్తే రెండు ప్రధానమే. రెండిటికి వేర్వేరు ప్రయోజనాలున్నాయి. ఈ క్రింది శ్లోకాన్ని గమనించండి.
శ్లోకము:-దేశజ్వరే గ్రామ గృహ ప్రవేశే, సేవాను, యుడ్డె, వ్వవహార, కారయే ద్యూతేషు, దానేషుచ నామ రాశిః యాత్రా వివాహ దిషు జన్మ రాశిః||
అనగా దేశ సంభందమైన, అనారోగ్య విషయం, గ్రామ ప్రవేశము, గృహ ప్రవేశము, యుద్ధ ప్రారంభానికి మొదలగు విషయాలకు నామ నక్షత్రాన్ని, యాత్రలకు వెళ్ళేటప్పుడు, వివాహము మొదలగు విషయములలో జన్మ నక్షత్రాన్ని చూడాలని పై శ్లోకంలో నిర్దేశించారు.
నామ నక్షత్రం తెలుసుకునే పద్దతి:-
ఆశ్వని: చూ/చే/చో/ లా
భరణి: లీ/లూ/లే/లో
కృత్తిక: /ఆ
పైన కన బరచిన అక్షరాలకు మేష రాశి.
కృత్తిక: ఈ/ఊ/ ఏ
రోహిణి: ఈ/వా/వీ/వూ
మృగశిర: వే/వో
ఈ మూడింటికి వృషభ రాశి.
మృగశిర కా/కీ,
ఆరుద్ర కూ/ ఖం/ జ/ ఛా
పునర్వసు: కే/కో/ హ
ఈ మూడింటికి మిధున రాశి.
పునర్వసు: / హీ/
పుష్యమి: హు/హే/హో/డా
ఆశ్లేష: డీ/డూ/డే/డో
వీటికి కర్కాటక రాశి.
.మఖ: /మా,/ మి,/ మూ, /మే
పూర్వ ఫల్గుణి: మో, /టా/ టీ,/ టూ
ఉత్తర ఫల్గుణి: / టే/
ఈ మూడింటికి సింహ రాశి.
ఉత్తర ఫల్గుణి: /టో,/ పా, /పీ,
హస్త: /వూ, /షం, /ణా,/ ఢా
చిత్త: /పే/పో
ఈ మూడింటిలోని అక్షరలకు కన్యారాశి.
చిత్త: /రా/రి
స్వాతి: /రూ,/ రే,/ రో, /లా
విశాఖ: /తీ, /తూ, /తే
వీటికి తులా రాశి.
విశాఖ: /తో,/
అనూరాధ: /నా, /నీ, /నూ, /నే
జ్యేష్ట, /నో, /యా, /యీ,/యూ
వీటికి వృశ్చిక రాశి.
మూల: /యే, /యో, /బా,/ బీ
పూర్వాషాడ: /బూ,/ ధా, /భా, /ఢా
ఉత్తరాషాడ: /బే
వీటికి ధనస్సు రాశి.
ఉత్తరాషాడ: /బో, / జా, / జీ,
శ్రవణం: /జూ,/జే, జో/, ఖా,
ధనిష్ట: /గా,/ గీ
వీటికి: మకర రాశి.
ధనిష్ట: /గూ, /గే,
శతభిషం: / గో, /సా,/ సీ, /సూ
పూర్వాభద్ర: / సే, /సో,/ దా
వీటికి కుంభ రాశి.
పూర్వా బాధ్ర: /దీ,
ఉత్తరా బాధ్ర: ధు/శ్చం/చా/ధా
రేవతి: /దే,/దో, /చా, /చీ
వీటికి మీన రాశి.

23, జులై 2022, శనివారం

గ్రహా దోషాలు-దానాలు

రవిగ్రహ దోషం ఉన్నవారు గోదుమపిండి, గోధుమరొట్టె, ఆరెంజ్ వస్త్రాలు, రాగి, రాగి జావ, క్యారెట్, సజ్జలు, మిరియాలు వస్తువులు దానం చేయవచ్చును.

చంద్రగ్రహ దోషం ఉన్నవారు అన్నదానం, బియ్యం, పాలు, నీళ్ళు, తెలుపు కాటన్ వస్త్రాలు, వెండి వస్తువులు, పొంగళి మొదలగునవి దానం చేయవచ్చును.

కుజగ్రహ దోషం ఉన్నవారు కందిపప్పు, మిరపకాయలు, పచ్చి ఖర్జూర, డేట్స్ సిరప్, బెల్లం, ఎరుపు వస్త్రాలు, వ్యవసాయ పనిముట్లు, శుక్రుడితో కలిసిన సోదరికి వస్త్రాభరణాలు బహుమతిగా ఇవ్వటం, ఎరుపు రంగు వస్త్రాలు మొదలగునవి దానం చేయటం.

బుధగ్రహ దోషం ఉన్నవారు పెసరపప్పు, ఆకుకూరలు, కూరగాయలు, ఆకుపచ్చ వస్త్రాలు, విద్యార్ధులకు విద్యా సంబంధమైన వస్తువులు, పుస్తకాలు, ఆవుకి పచ్చగడ్డి వెయ్యటం మొదలగునవి దానం చేయవచ్చును.

గురువుగ్రహ దోషం ఉన్నవారు పండ్లు, తీపి పదార్ధాలు, శెనగ గుగ్గిళ్ళు, ధార్మిక కార్యక్రమాల కోసం దానం, విద్యా, వైద్యం, భోజనం, పసుపు రంగు వస్త్రాలు, తియ్యని పానియాలు, బఠాని గుగ్గిళ్ళు, దానం చేయవచ్చును.

శుక్రగ్రహ దోషం ఉన్నవారు స్త్రీలకు సంబందించిన బొట్టు బిళ్ళలు, జడ పిన్నులు, జడ రబ్బర్లు, గోరింటాకు, గోళ్ళ రంగులు, సెంటు, అద్దాలు, దువ్వెనలు, పౌడర్లు, పూలు, డ్రైప్రూట్స్, బొబ్బర్లు, అలచందలు, రంగు రంగుల వస్త్రాలు, మొదలగునవి దాన చేయవచ్చును.

శనిగ్రహ దోషం ఉన్నవారు వంట నూనె, నువ్వులు, ఇనుము, దేవాలయాలకు సిమెంట్, నీలిరంగు వస్త్రాలు, కార్మికులకు, పనిచేసేవారికి వస్తు, ధన రూపంలో దానం చేయవచ్చును.

రాహుగ్రహ దోషం ఉన్నవారు మినప సున్నిండలు, ఇడ్లీలు, మినపగారెలు, తడిపి నాబెట్టిన మినుములు ఆవుకి పెట్టటం, పొగరంగు వస్త్రాలు దానం చేయవచ్చును.

కేతుగ్రహ దోషం ఉన్నవారు పశువులకు, పక్షులకు, చేపలకు ఆహారం పెట్టటం, ఉలవల పొడిని ఆవులకి పెట్టటం, విచిత్ర వర్ణ వస్తువులు దానం చేయవచ్చును.

22, జులై 2022, శుక్రవారం

రేపు_ఆడి_కృత్తిక

 
#శ్రీ_సుబ్రహ్మణ్యుని_ఆరాధనకు_విశేషమైన_రోజు 
 

ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు ... ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు ... ఈ రోజున సుర్యోదయానికంటే ముందే నిద్ర లేచి శుచియైన తరువాత చలిమిడితో ( చలిమిడి అంటే బియ్యప్పు పిండిని బెల్లంతో కలిపి ముద్దగా చేయాలి ) ఆవు నేతితో మూడు వత్తుల దీపం శివ కుటుంబం ( శివుడు, పార్వతీ దేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ) చిత్రపటం ముందు వెలిగించి ... చిమ్మిలి ( తెల్ల నువ్వులు బెల్లం కలిపి చేస్తారు ), పచ్చి పాలు, వడపప్పు ( నానబెట్టిన పెసరప్పు ), అరటి పండ్లు, తాంబూలం ఇవన్నీ నివేదించి, సుబ్రహ్మణ్యుని స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృతాంతం చదువుకుని, సాయంత్రం వరకూ ఉపవసించి, సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదముగా పిండి దీపము, చిమ్మిలి, వడపప్పు, అరటి పండ్లు స్వీకరించాలి. ముందు రోజు రాత్రి మరియూ ఆ రోజు రాత్రి  బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వలన సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు, జడులు, మతి స్థిమితం సరిగ్గా లేని పిల్లలకు ఈ పూజ అమృత తుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్యుడు ఉత్తమమైన జ్ఞానం కలిగిస్తాడు. ఇది తమిళ నాట ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం లేదు. తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో మాత్రమే జరుపుతుంటారు. ... 

అసలు ఎందుకు ఈ కృత్తికకు అంత ప్రత్యేకతో తెలుసుకుందాం ... తమిళులకు ఏ మాసమైన పౌర్ణమి రోజుతో మొదలవుతుంది, కనుక ఆషాడ పౌర్ణమి నుండీ వారికి ఆషాడ మాసం ప్రారంభమయ్యిందన్నమాట. మనకు ఆషాడ మాసంలో బహుళ ఏకాదశి నుండీ దక్షిణాయనం ప్రారంభమవుతుంది, అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృ దేవతల ఆరాధనకు ప్రీతికరమైనది. పార్వతీ దేవి సుబ్రహ్మణ్యుని మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే  సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక గనుక దీనిని ఆది కృత్తిక అనీ, ఆషాడ మాసంలో వచ్చేది కనుక ఆడి కృత్తిక అనీ కూడా అంటుంటారు. అందుకే ఆషాడ ఆడి కృత్తిక సుబ్రహ్మణ్యుని ఆరాధనకు అత్యంత శ్రేయస్కరమైనది. 

వీలైతే రేపు ఎవరైనా వేదవిధునికి కుదిరితే ( బాల బ్రహ్మచారి అయినా వేదవిధునికి ) షడ్రసోపేతమైన భోజనం పెట్టి, ఎర్రటి పంచ, పైపంచ, శక్తిమేరకు దక్షిణ, తాంబూలం, అరటి పండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబు( లేదా పంచపాత్ర ఉద్దరిణ, అర్ఘ్య పాత్ర ) సమర్పించి, తానే సుబ్రహ్మణ్యుని భావించి ఆశీర్వచనం తీసుకుంటే కలిగే ఫలితం మాటల్లో వర్ణించలేము ... ఒకవేళ బాల బ్రహ్మచారియైన వేదవిధుడు లేక గృహస్తు అయిన వేదవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైన ఆకలితో ఉన్నవారికి కడుపు నిండుగా ఆహరం పెట్టినా మంచిదే ... ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశు పక్షాదులకు ఆహరం సమర్పించి సుబ్రహ్మణ్యుని ప్రార్ధించినా ఉత్తమ ఫలితం ఉంటుంది .

కనుక వీలైన వారందరూ తమ శక్తివంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిని రేపు ఆరాధించండి. 

ఓం శరవణభవ

నక్షత్రాలు - గణపతి ఆరాధన

ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చేయాలి

1. అశ్విని  -- ద్వి ముఖ గణపతి ‌
2. భరణి -- సిద్ద గణపతి.
3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి .
4. రోహిణి - విఘ్న గణపతి ‌
5. మృగశిర - క్షిప్ర గణపతి.
6. ఆరుద్ర - హేరంబ గణపతి .
7. పునర్వసు - లక్ష్మి గణపతి. 
8. పుష్యమి - మహ గణపతి. 
9. ఆశ్లేష - విజయ గణపతి. 
10. మఖ - నృత్య గణపతి. 
11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి. 
12 ఉత్తర - ఏకాక్షర గణపతి. 
13. హస్త - వరద గణపతి .
14. చిత్త -  త్య్రక్షర గణపతి. 
15. స్వాతి - క్షిప్రసాద గణపతి. 
16. విశాఖ - హరిద్ర గణపతి. 
17.అనూరాధ - ఏకదంత గణపతి. 
18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .
19 మూల ఉద్దాన గణపతి. 
20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి. 
21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి. 
22. శ్రవణం - ద్వి ముఖ గణపతి. 
23. ధనిష్ట - త్రిముఖ గణపతి. 
24. శతభిషం - సింహ గణపతి. 
25. పూర్వాభాద్ర - యోగ గణపతి. 
26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి. 
27. రేవతి - సంకట హర గణపతి.           

పై గణపతి ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయట పడి భగవంతుని అనుగ్రహం పోందుతాము. 

అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు కు ముడి పడి వుంది.    పై గణపతులు మరియి నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకో గలిగితే ద్వాదశ భావాలు యెక్క   రహస్యం అర్దం అవుతుంది.

21, జులై 2022, గురువారం

మానవశరీరం -చక్రాలు

 మానవ శరీరంలో ఆరు చక్రాలు మరియు సహస్రారం (కుండలిని) తో కలుపుకొని ఏడు.

ఇలా ఆరు చక్రాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి గుండ్రంగా చలిస్తూ ఉంటాయి.ఈ ఆరు చక్రాలలో ఒక్క చక్రం చలించటం నిలిచిపోయిన మానవ శరీరం నుండి జీవుడు వెళ్లిపోతాడని శాస్త్ర వివరణ.ఆ చక్రాలు ఈ క్రింది విధంగా మానవ శరీరమందు లీనమై ఉంటాయి.

1.మూలాధారం(Root chakra)

2.స్వాధిష్ఠానం(Spleen chakra)

3.మణిపూరక(Solar chakra)

4.అనాహత(Heart chakra)

5.విశుధ్ధ(Throat chakra)

6.ఆజ్ఞా(Brow chakra)

7.సహస్రారం(Crown chakra) ఇక ఈ చక్రాల స్థానాలు మరియు వాటి స్థానాలలో గల దేవతలను గురించి చూద్దాం.


పంచ భూతాలు అనగా 1.భూమి 2.ఆకాశం 3.నీరు 4.నిప్పు 5.గాలి ఇలా పంచ భూతాలు మానవ శరిరంలో లీనం అయి ఉంటాయి.


1.మూలాధారం: ఇది మానవ శరీరానికి నడి భాగంలో ఉంటుంది.ఇది పృద్వి భూత స్ధానం (భూమి) ఈ చక్రానికి అధిపతి గణపతి.


2.స్వాధిష్ఠానం:ఇది మూలాధారానికి దాదాపుగా రెండు అంగుళాలపైన అనగా పొత్తి కడుపులో ఉంటుంది.ఇది జల భూత స్థానం (నీరు) ఈ చక్రానికి అధిపతి బ్రహ్మ.


3.మణిపూరక: ఇది మానవ శరీరానికి బొడ్డు స్థానంలో ఉంటుంది.ఇది అగ్ని భూత స్థానం (నిప్పు) దీనికి అధిపతి విష్ణువు.


4.అనాహత:ఇది మానవ హృధయ స్థానంలో ఉంటుంది.ఇది వాయు భూత స్థానం(గాలి).దీనికి అధిపతి రుద్రుడు


5.విశుద్ధ: ఇది మానవ శరీరంలో గొంతు స్థానంలో ఉంటుంది.ఇది దివి భూత స్థానం (ఆకాశం)దీనికీ అధిపతి జీవుడు.


6.ఆజ్ఞా: ఇది మానవ శరీరంలో నుదుటి స్థానంలో ఉంటుంది. ఇది జీవాత్మ స్థానం.దీనికీ అధిపతి జీవుడు.


7.సహస్రారం:ఇది తల పై భాగాన (నడి నెత్తిన) ఉంటుంది.ఇది చక్రం కాదు రంద్రం దీనినే బ్రహ్మ రంద్రం అని కూడా చెపుతారు.దీనికి అధిపతి ఈశ్వరుడు.


మరియు మన హైందవ సాంప్రదాయ పెళ్ళిల్లలో సైతం తలపై జీలకర్ర మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టిన తరువాత వధూ వరులను ఒకరికొకరిని చూసుకొమని చెబుతారు.కారణం అలా జీల కర్రా మరియు బెల్లం మిశ్రమాన్ని తలపై పెట్టగానే బ్రహ్మ రంద్రం తెరుచుకుంటుంది.అలా తెరుచుకున్న తరువాత మొదటగా చూసిన వారే జీవిత భాగ స్వామిగా బ్రహ్మ స్థలిలో నిర్ణీతం అవుతుంది.


ఇలా అనేక అంగాల కలయికే చక్రం అని పిలవబడుతుంది. ఇలా ఒక్కో చక్రం శరీరంలో ఒక్కో స్థానంలొ లినమై ఉంటుంది.

అనాపానసతి వలన కుండలినీ జాగృతమై,షట్ చక్రాలలో శుద్ది జరుగుతుంది.

కుండలినీ ఎప్పుడైతే సహస్రాణంతో స్తితమవుతుందో అపుడు మనిషి నిర్వాణ స్తితిని పొందుతాడు.

తిథులు

వేద సమయానుసారము ఒక చాంద్రమాన రోజును తిథి అంటారు లేదా శాస్త్రీయముగా సూర్యుడు మరియు చంద్రున్ని కలుపుతూ ఉన్న ఆక్షాంశ కోణము 12 డిగ్రీలు పెరగడానికి పట్టే కాలాన్ని తిథి అనవచ్చు. తిధులు రోజులోని ఏ వేళలలో అయినా మొదలయ్యి, అంతమయ్యే అవకాశము ఉన్నది. ప్రతి చాంద్రమాసములో 30 తిధులు ఉంటాయి. శుక్లపక్షంలో పాడ్యమి నుండి పూర్ణిమ వరకు 15, మరల కృష్ణపక్షంలో పాడ్యమినుండి అమావాస్య వరకు 15. మొత్తం 30 తిథులు. రవి చంద్రుల మధ్య దూరం 0 డిగ్రీ ఉన్నప్పుడు అమావాస్య, 180 డిగ్రీలు దూరమున్నప్పుడు పూర్ణిమ ఏర్పడుతాయి. చంద్రుడు, రవి నుండి ప్రతి 12 డిగ్రీలు నడిచినపుడు తిథులు మారతాయి.

ఉత్తమ తిధులు:- 11. శుక్ల ఏకాదశి,12. శుక్ల ద్వాదశి,13. శుక్ల త్రయోదశి,14. శుక్ల చతుర్దశి,15. పూర్ణిమ, 1. కృష్ణ పాడ్యమి,2. కృష్ణ విదియ,3. కృష్ణ తదియ,4. కృష్ణ చవితి,5. కృష్ణ పంచమి.

మద్యమ తిధులు:- 6. శుక్ల షష్ఠి,7. శుక్ల సప్తమి,8. శుక్ల అష్టమి,9. శుక్ల నవమి,10. శుక్ల దశమి, 6. కృష్ణ షష్ఠి7. కృష్ణ సప్తమి,8. కృష్ణ అష్టమి,9. కృష్ణ నవమి,10. కృష్ణ దశమి.

అధమ తిధులు:- ,3.శుక్ల తదియ,4.శుక్ల చవితి,5.శుక్ల పంచమి.11.కృష్ణ ఏకాదశి,12.కృష్ణ ద్వాదశి,13.కృష్ణ త్రయోదశి,14.కృష్ణ చతుర్ధశి,15.అమావాస్య.

సంకల్పతిధి;-ఒక రోజు సూర్యోదయం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏ తిధి ఉన్నదో ఆ తిధినే ఆ రోజంతా సంకల్పానికి చెప్పాలి.ఒక రోజు సూర్యోదయానికి ఒక తిధి ఉండి మరుసటి రోజు సూర్యోదయం లోపల ఇంకొక తిధి వస్తే మొదటి తిధి ‘ఉపరి’రెండవ తిధి అని చెప్పాలి.

తిధి సంధి:-పంచమి,షష్ఠి లయొక్కయు,దశమి,ఏకాదశి ల యొక్కయు 4 ఘడియలు తిధిసంధి అనబడును.ఈ సంధిన జననమైన యెడల పితృగండం.

గండతిధి:-పూర్ణ తిధులలో చివరి 48 నిమిషాలు,నంధ తిదులలో మొదటి 48 నిమిషాలు తిధి గండాతాలు అవుతాయి.శుభకార్యాలు చేయరాదు.

పంచ పర్వతిధులు :-అష్టమి,చతుర్ధశి,అమావాస్య,పౌర్ణమి,సూర్య సంక్రమణం ఉన్న తిధి పంచపర్వ తిధులు అంటారు.ఇవి శుభకార్యాలకు పనికిరావు.

పక్ష రంధ్ర తిధులు:-చవితి మొదటి 8 ఘడియలు,షష్ఠి మొదటి 9 ఘడియలు,అష్టమి మొదటి 14 ఘడియలు,నవమి మొదటి 25 ఘడియలు,ద్వాదశి మొదటి 10 ఘడియలు,చతుర్ధశి మొదటి 5 ఘడియలు.ఈ ఘడియలలో వివాహం చేయరాదు.మిగిలిన ఘడియలు శుభప్రధములు.

పితృకార్యములకు తిధి:-అహఃప్రమాణమును (పగటి ప్రమాణం)ను ఐదు భాగాలుగా చేస్తే అందులో మొదటిభాగం ప్రాతఃకాలం,రెండవ భాగం సంగమ కాలం,మూడవ భాగం మధ్యాన్నం,నాల్గవ భాగం అపరాహ్నం,ఐదోభాగం సాయంకాలం .ఏ తిధి మద్యాన్నం మించి అపరాహ్నం వరకు వ్యాపించి ఉన్నదో ఆ తిధి పితృకార్యములకు మంచిది.

20, జులై 2022, బుధవారం

వాస్తు పురుషుని స్తితి


వాస్తు పురుషుడు భాద్రపద బహుళ తదియ శనివారం కృత్తికా నక్షత్రం నందు వ్యతీపాత యోగం నడుచుచుండగా భద్ర కరణముల యొక్క మధ్యభాగమున వాస్తు పురుషుని ఉద్భవం జరిగింది. 

స్దిర వాస్తు పురుషుడు:- వాస్తు పురుషుడు అధోముఖంగా శయనిస్తూ ఈశాన్యంలో తల ఉంచి (వాస్తు పురుషుని శిరస్సు) పాదాలు నైరుతి భాగంలో ఉంటాయి. వాయువ్య, ఆగ్నేయ దిక్కులలో భుజాలు, మధ్యభాగంలో వక్ష స్ధలం, హస్తాలు ఉంటాయి. ఈ వాస్తు పురుషున్ని స్ధిర వాస్తు పురుషుడు అంటారు. 

చర వాస్తు పురుషుడు:- స్దిర వాస్తు పురుషుడే సూర్య సంచారాన్ని బట్టి చర వాస్తు పురుషునిగా సంచరిస్తాడు. ఈశాన్య దిక్కు నుండి తూర్పుకి సంచరిస్తాడు. వాస్తుపురుషుని ఎడమభాగం అంటే ఎడమవైపుగా తిరిగి శయనించి సూర్యుడున్న రాశిలో పాదాలు ఉంచి దానికి సప్తమరాశిలో తల ఉంచి నాలుగు దిక్కులకు పరిభ్రమిస్తాడు. కన్య,తుల, వృశ్చిక రాశులలో సంచరించేటప్పుడు తూర్పు శిరస్కుడుగాను, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో సంచరిస్తాడు. 

తూర్పు శిరస్కుడు:- భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో వాస్తు పురుషుడు తూర్పున శిరస్సు, పడమర పాదాలు ఉంచి ఎడమప్రక్కగా శయనిస్తాడు. కాబట్టి వాస్తుపురుషుని పూర్ణదృష్టి దక్షిణ దిశ యందు, పాదదృష్టి పడమర దిక్కున పడును. అందుచే భాద్రపద, ఆశ్వయుజ, కార్తీకమాసాలలో దక్షిణ, పడమర సింహద్వారం కల ఇండ్లు నిర్మించుకోవచ్చును. 

దక్షిణ శిరస్కుడు:- మార్గశిర, పుష్య, మాఘ మాసాలలో వాస్తుపురుషుడు దక్షిణదిశలో శిరస్సును, ఉత్తరాన పాదాలు ఉంచి ఎడమప్రక్కగా శయనిస్తాడు. అతని పూర్ణదృష్టి పడమర దిశలోను, పాదదృష్టి ఉత్తర దిశ గాను ప్రసరిస్తుంది. కాబట్టి మార్గశిర, పుష్య, మాఘమాసాలలో పడమర, ఉత్తర సింహద్వారం కల ఇల్లు కట్టటం మంచిది.

పశ్చిమ శిరస్కుడు :- ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాలలో వాస్తుపురుషుడు పడమర దిశలో శిరస్సును, తూర్పు దిశలో పాదాలు ఉంచి ఎడమపక్కగా శయనిస్తాడు. అతని పూర్ణదృష్టి ఉత్తర దిక్కునందు, పాదదృష్టి తూర్పుదిక్కునందు ప్రసరిస్తుంది. కాబట్టి ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసాలలో ఉత్తర, తూర్పు సింహద్వారం కల ఇండ్లు నిర్మించుకోవచ్చును. 

ఉత్తర శిరస్కుడు :- జ్యేష్ఠ, ఆషాడ, శ్రావణ మాసాలలో వాస్తు పురుషుడు ఉత్తర దిశయందు శిరస్సును, దక్షిణ దిశయందు పాదాలను ఉంచి ఎడమప్రక్కగా శయనిస్తాడు. అతని పూర్ణ దృష్టి తూర్పుదిశలోను, పాదదృష్టి దక్షిణ దిశలోను ప్రసరిస్తుంది. కాబట్టి జ్యేష్ఠ, ఆషాడ, శ్రావణ మాసాలలోతూర్పు, దక్షిణ సింహద్వారం కల ఇండ్లు నిర్మించుకోవచ్చును.

19, జులై 2022, మంగళవారం

నవగ్రహముల విశిష్టత


1.చంద్రుడు :

అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం.
అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.

2.గురువు :

సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుంది. గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలిగుతుంది.

3.బుధుడు :

బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపము. అందునా బుధవారం అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన,
జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపము.

4.శని :

శనికి పెద్దల్ని కించపరచిన,
మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. 

తల్లితండ్రిని చులకన చేసిన సహించడు.
సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.

5.సూర్యుడు :

పితృ దేవతలని దూషిస్తే రవికి కోపము. నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత.
సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదు

6.శుక్రుడు :

శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపము. ప్రేమకారకుడు. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే.

అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టము.

7.కుజుడు :

అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపము.
వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడు.

8.కేతువు :

జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన,
మోక్ష కారకుడు అయిన కేతువుకి 

పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు.
ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.

9.రాహువు :

రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును.
ఈయన భ్రమ మాయ కి కారణము..!! 

18, జులై 2022, సోమవారం

వివాహం _ గోత్రాలు

*ఒకే గోత్రీకుల మధ్య వివాహాలు ఎందుకు చేయరాదు?*

శ్లో ll  సప్తమాతృచం మాద్థీమాన్ య:కన్యాముద్వహేన్నరః !
గురుతల్పీన విజ్ఞేయః సగోత్రాన్ చైవ ముద్వహన్!! - ధర్మసింధు 

తండ్రి తరుపున ఏడులతరాలలోగాని, తల్లితరపున ఐదు తరాలలోగాని సగోత్రీకులైన వారిని వివాహం చేసికొనరాదు. అట్లుచేసికొన్నచో తల్లిని (గురుపత్నిని) వివాహం చేసికొన్నంత పాపం సంభవిస్తుంది.

సనాతన సంప్రదాయంలో యజ్ఞయాగాలు మొదలైన వైదిక కర్మలకు, వివాహాది శుభకార్యాలకు, శ్రాద్దాది పితృకర్మలకు తప్పనిసరిగా గోత్రం, ప్రవర తప్పనిసరిగా తెలియపర్చవల్సి వుంటుంది. మనందరి గోత్రాలకు ఎనిమిది మంది మహర్షులు మూలపురుషులుగా వున్నారు. అగస్త్యమహర్షి- భరద్వాజ మహర్షి - గౌతమ మహర్షి - వశిష్టమహర్షి - కాశ్యపమహర్షి - భరద్వాజ మహర్షి - అత్రిమహర్షి - జమదగ్నిమహర్షి ఈ ఎనిమిది మంది మహర్షులు మనకు గోత్రపురుషులు.

ఏ గోత్రం వారు ఆ గోత్రం వారికి రక్తసంబంధీకులు అవుతారు.

 ఈ ఎనిమిది మంది గోత్రపురుషులకు కలిపి నలభైతొమ్మిది మంది ప్రవర పురుషులున్నారు. సంతానోత్పత్తి క్రియకు (దాంపత్యానికి) ఒకే గోత్రీకులు అయి వుండ రాదు. ఒకే ప్రవర వున్నవారు కూడా పనికిరారు దాంపత్య బంధానికి పనికిరారు (వివాహం కుదరదు). 

వధూవరులు ఒకే గోత్రం కలవారైనా, ఒకే ప్రవర' వారైనా అన్నాచెల్లెళ్ళవుతారు.

సగోత్రీకుల వివాహబంధం కంటే వర్ణాంతర వివాహమే మేలైనది.

సగోత్రీకులు, సప్రవరీకుల మధ్య మాత్రమే కాకుండా మేనత్త కూతురిని అన్నగారి మరదలిని (వదిన చెల్లెలిని) మేనమామ కూతుర్ని కూడా వివాహం చేసుకోకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది. తండ్రితరపు రక్తసంబంధీకులు ఏడుతరాలవారు, తల్లితరపున రక్తబంధువులు ఐదుతరాలవారు కాకుండా వున్న కన్యను పెండ్లిచేసుకోవాలని అన్నిశాస్త్రాలు చెబుతున్నాయి. అక్క కూతురిని పెండ్లి చేసుకోవటం కూడా ధర్మాచారం కాదు. అనగా తండ్రిగారి చెల్లెలి బిడ్డను (మేనత్త కూతురు) తల్లిగారి చెల్లెలిబిడ్డను (పినతల్లి కూతురు) వివాహ మాడరాదు.

కుండ మార్పిడి వివాహాలు కాని, ఒకే పందిరిలో రెండు పెళ్ళిళ్ళుగాని నిషిద్ధం.

*దూర సంబంధీకులైన భార్యాభర్తలకు పుట్టే పిల్లలు
ఆరోగ్యంగానూ తెలివిగలవారుగానూ, సౌందర్యవంతులుగానూ వుంటారనేది మాత్రం నిజం. సగోత్ర సంబంధాలను 
పురాణాలు, స్మృతులు, అన్ని వ్యతిరేకిస్తున్నాయి*

గ్రహముల వృత్తికారకత్వాలు

*గ్రహాలు- వృత్తి కారకత్వాలు* 

జాతకచక్రంలో ఏఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో పరిశీలించి ఆయా గ్రహాలకు సంబందించిన వృత్తులను చేసుకోవటం వలన వ్యాపారాభివృద్ధి, ధనాభివృద్ధి, గౌరవాలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 

👉👉సూర్యుడు : వైద్యశాస్త్రం,బౌతికశాస్త్రం,కుజునితో కలసిన శస్త్ర చికిత్సకునిగా,గురువుతో కలసిన ఆయుర్వేదం,శనితో కలసిన అనస్తీషియా,ఆర్ధోఫిడిక్స్ వైద్యుడు,చంద్ర,శుక్రులతో కలసిన గైనకాలజిస్ట్,బుధునితో కలసిన నరాల నిపుణులు,మరియు కర్ణరోగ వైద్యం సూచించును.రాజ్యాధికారము , పరిపాలనా విభాగాములకు అధికారి , ఆఫీస్ మేనేజ్ మెంట్ , అధ్యక్ష పదవులు, ధార్మిక సంస్థలు , సంఘములకు గౌరవ అధ్యక్షులు మొదలగు అనేక విధముల యజమాని హోదా పొందగలరు. చట్ట సభలలో అధికారము, శాసన నిర్మాణ కర్తలు , ప్రజా పరిపాలకులు . ఆర్డర్స్ జారీ చేయు అధికారము , హోదా , గౌరవము కలిగిన వృత్తులను ప్రసాదించును.

👉👉👉చంద్రుడు : చరిత్ర,కవిత్వం,సైకాలజీ,సముద్ర గర్బమును పరిశోదించుట. నీటికి సంబంధించిన శాఖలు , ద్రవ పదార్దములకు సంబంధించినవి . తెలుపు వర్ణమునకు చెందినవి . అనగా కూల్ డ్రింక్స్ , పాలు , పాల ఉత్పత్తులు , పంచదార , బియ్యము వ్యాపారములు , రైస్ మిల్స్ , హోటల్స్ , టిఫిన్ సెంటర్స్ , మిల్క్ పార్లర్స్ , నావికుల విద్య,శుక్రునితో కలసిన పాల వ్యాపారం,పెయింట్స్,కుజ శుక్రులతో కలసిన పశువైద్యం,బుద్ధునితో కలసిన టెక్స్ టైల్స్,వస్త్ర వ్యాపారములు , వాటర్ ప్లాంట్స్ , నీరు , చేపల ఉత్పత్తులు , బావులు త్రవ్వడం , బోరింగ్స్ , సముద్రపు ఉత్పత్తులు , జలాంత ర్గామి, నావికా దళ ఉద్యోగములు , దూది వ్యాపారము , దూది ఉత్పత్తులు, పుడ్ ప్రొడక్ట్స్ , వెండి వస్తువులు తయారీ మొదలగు వృత్తులను ప్రసాదించును .

👉👉👉కుజుడు :
గృహ నిర్మాణం,సర్వే,సివిల్ ఇంజనీర్,శస్త్ర చికిత్సలు,పశుపోషణ,శస్త్ర చికిత్సలు,మెకానికల్ ఇంజనీర్,రసాయన విద్యలు,రక్షణ విధానం,పేలుడువస్తువులు,ఫైర్ సర్వీస్,తీర్పులు,హైడ్రో ఎలక్ట్రిక్ ఇంజనీర్,విమాన చోదక విద్య,వ్యవసాయము , వ్యవసాయ ఉత్పత్తులు , మాంసపు ఉత్పత్తులు , కోళ్ల పరిశ్రమలు , యంత్రములు, పనిముట్లు తయారీ , వడ్రంగి పనులు , భవన నిర్మాణములు , కనస్ట్రక్షన్స్ , కాంట్రాక్టులు , బిల్డింగ్ మెటీరియల్ , విద్యుత్తు శక్తి శాఖలు , విద్యుత్ ప్లాంట్స్ , మిలటరీ , పోలీస్ తదితర రక్షణ శాఖలు , సైన్యమునకు సంబంధించిన ఉద్యోగాలు , మోటార్స్ , మెకానికల్ , భూ పరిశోధన, అటవీ ఉత్పత్తులు , అటవీ శాఖ కు చెందిన ఉద్యోగాలు ఇలాంటి వృత్తులు కుజుడు ఆధీనము లో ఉంటాయి .

👉👉బుధుడు :
 వ్యాపారం,కమర్షియల్ డిగ్రీలు,బ్రోకర్స్ , బ్యాంకులు , పైనాన్సియల్ సెక్షన్స్ , చిట్ ఫండ్ వ్యాపారములు , ట్రెజరీ డిపార్టమెంట్లు , బడ్జెట్ తయారీ చేయువారు , చిత్ర కళ,డ్రాయింగ్,పెయింటిగ్,నమూనాలు గీయుట,ఎస్టిమేటింగ్,వ్రాత,గణిత విద్య,కంస్ట్రక్షన్ డిజైన్,జ్యోతిష్యం,శుక్రునితో కలసిన చాయా చిత్రములకు చెందిన వ్యాపారం,రసాయన శాస్త్రం,జీవశాస్త్రం,వృక్షశాస్త్రం,అనువాదకులు,ఉపాద్యాయులు, పత్రికలు , పత్రికా సంపాదకులు , ముద్రణా రంగములు , పుస్తక పరిశ్రమలు , రచయితలు చార్టెడ్ ఎకౌంట్స్ , విలేఖర్లు ,జర్నలిజం , గుమస్తా ఉద్యోగాలు ,సాప్ట్ వేర్ , కంప్యూటర్ , టెక్నాలజీ సంబంధిత ఉద్యోగ వ్యాపారాలు పచ్చళ్ళు పరిశ్రమలు. 

👉👉గురుడు :
న్యాయవాదులు,ఆర్ధిక శాస్త్రం,సంస్కృతంలో పట్టాలు,వేదాంతం,అవదాన విద్యలు,జ్యోతిష్యం,విద్యా సంస్థలు , ఉపాధ్యాయులు, లెక్చరర్స్ , భోధనా సంబంధ ఉద్యోగములు , పురోహితులు , పూజార్లు , పూజ గది , పూజా ద్రవ్యములు , దేవాలయ సిబ్బంది , దేవాదాయ శాఖలలో ఉద్యోగాలు , పరిశోధనా రంగములు , విశ్లేషకులు , మత ప్రచారకులు , మేధావి వర్గమునకు చెందినవారు . సంస్కృతి , సంప్రదాయములను వివరించు స్వామీజీలు వీరందరూ గురుడు కు సంబంధించిన వారు . గురుడు ఆకాశ తత్వమునకు చెందిన వాడు కాబట్టి విమానయాన రంగములు , శాటిలైట్ లు మొదలగునవి .

👉👉శుక్రుడు :
 నాట్య రంగం,చిత్రకళలు,రసాయన శాస్త్రం,కామశాస్త్రం,గురు,బుదులతో కలసిన ఎలక్ట్రానిక్స్,వస్త్రాలు, ఆభరణ తయారీలు , ఆర్నమెంట్ నగల వ్యాపారము , బంగారు వ్యాపారము , అలంకరణ సామాగ్రి , ఇంటీరియర్ డిజైనింగ్ , ఫాన్సీ దుకాణాలు , హైర్ స్టైయిల్ డిజైనింగ్,కుట్టుపని,ఎంబ్రాయిడరీ ట్రైనింగ్,ఇల్లు,వాహనాలకు పెయింట్స్ వేయటం,మసాజ్ సెంటర్స్ , రెడీమేడ్ వస్త్రములు , వస్తువులు , స్త్రీలకు సంబంధించిన వస్తువులు , సుగంధ ద్రవ్యములు , అగరబత్తీ పరిశ్రమలు, నూతన వస్తువులు, కళలు , సినిమా రంగము , కళాకారులు , ఎలక్టానిక్ మీడియా , గాయకులు , సంగీత సాహిత్య రంగములు , 

👉👉శనిగ్రహము 
:గనులు,త్రవ్వకాలు,భూగర్భ శాస్త్రం,భూగోళ శాస్త్రం,పురాతన వస్తుసేకరణ,బొగ్గు గనులు,ఆర్ధోఫిడిక్స్, రాజకీయ నాయకులు , నామినేటెడ్ పోస్టులు పొందేవారు . న్యాయవాదులు , జడ్జీలు , న్యాయశాఖకు సంబంధించి ఉద్యోగులు , గాలికి సంబంధించిన రంగములు అనగా టెలీ ఫోన్ , కమ్యునికేషన్ , బట్వాడా కార్మికులు , తపాలా శాఖ , సేవకులు , కూలీలు , వ్యవసాయ కార్మికులు , కష్టముచే జీవించువారు , ఇనుము ,ఉక్కు పరిశ్రమలు , ఇనుము ఉత్పత్తులు , బొగ్గు సంబంధిత శాఖలలో పనిచేయువారు , బరువులు మోయువారు , ఇన్సూరెన్స్ సంబందిత రంగములలో పని చేయువారు,ఇంగ్లీష్ విద్య,ప్రజా ప్రభుత్వ విద్యలు, సంచార జీవులు, నూనె కర్మాగారములు , పెట్రోల్ , డీసెల్ , గ్యాస్ సంబంధిత పరిశ్రమలలో ఉద్యోగ, వ్యాపారములు , సెకండ్ హ్యాండిల్ వస్తువుల వ్యాపారము మొదలగు వృత్తులు శనిగ్రహము వలన కలుగును . కంప్యూటర్ హార్డ్ వేర్ , అసెంబ్లింగ్ యూనిట్స్ మొదలగునవి .

👉👉రాహువు :
 ఈ గ్రహ ప్రభావము వలన డాక్టర్స్ , మత్తు పానీయముల వ్యాపారము చేయువారు , మందుల దుకాణములు, కెమికల్ ఇండస్ట్రీస్ , రసాయన శాస్త్రవేత్తలు , చెత్త వ్యాపారము ఈ గ్రహమునకు సంబంధించిన వారు.

👉👉కేతువు : 
చర్మపు ఉత్పత్తులు , జోళ్ళు , రబ్బరు పరిశ్రమలు , రబ్బరు ఉత్పత్తులు మొదలగు వృత్తులను కలిగించును.

17, జులై 2022, ఆదివారం

విగ్రహారాధన గురించి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు

మూర్తి రూపురేఖ భ్రూమధ్యమున నిల్ప
దివ్యమైన వెలుగు తేజరిల్లు 
మూర్తి లేని రాయి ముఖ్యమ్ము గాబోదు 
కాళికాంబ హంస కాళికాంబ!

18.07.2022

🕉 శ్రీ గురుభ్యోనమః
సోమవారం, జూలై 18, 2022
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయణం - గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం -   బహుళ పక్షం
తిథి:పంచమి మ2.17 వరకు
వారం:సోమవారం(ఇందువాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర సా6.16 వరకు
యోగం:శోభన రా9.44 వరకు
కరణం:తైతుల మ2.17 వరకు తదుపరి గరజి రా1.42 వరకు
వర్జ్యం:తె3.44 - 5.19
దుర్ముహూర్తం:మ12.31 - 1.23 &
మ3.07 - 3.58
అమృతకాలం:ఉ10.30 - 12.03
రాహుకాలం:ఉ7.30 - 9.00
యమగండ/కేతుకాలం:ఉ10.30-12.00
సూర్యరాశి:కర్కాటకం
చంద్రరాశి: కుంభం
సూర్యోదయం:5.37
సూర్యాస్తమయం:6.34
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు 

వధూవరుల ఏక నక్షత్ర వివరణ

వధూవరుల ఏక నక్షత్ర ప్రభావాలు

రోహిణి, ఆరుద్ర, మఘ, హస్త, విశాఖ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతీ నక్షత్రాలు పాద భేదం ఉన్నప్పుడూ వధూవరులకు ఒకే నక్షత్రమైన వివాహం చేయవచ్చును.

అశ్వని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, పుబ్బ, ఉత్తర, చిత్త, అనూరాధ, పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రాలు పాద భేదం ఉన్నప్పుడు వధూవరులకు ఒకే నక్షత్రమైన వివాహం చేయటం మధ్యమం.

భరణి, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రాలు వధూవరులకు ఒకే నక్షత్రమైనప్పుడు వివాహం చేయరాదు.

రెండు రాశులలోను ఒకే నక్షత్రం వధూవరులదైనప్పుడు ముందు రాశి పురుషునిది, తరువాతి రాశి స్త్రీది కావటం మంచిది. భిన్న నక్షత్రాలై ఒకే రాశి అయినప్పుడు మొదట పురుష నక్షత్రం, తరువాత స్త్రీ నక్షత్రం కావటం మంచిది.

ఒకే రాశి యందు జన్మించినప్పుడు భరణి, కృత్తిక, ధనిష్ఠ, శతభిషం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించినప్పుడు వివాహానికి పనికి రాదు.

కృత్తిక – ఆశ్లేష; ఆశ్లేష –స్వాతి; చిత్ర – పూర్వాషాడ; అనురాధ –ధనిష్ఠ; ధనిష్ఠ – భరణి; శతభిషం – కృత్తిక నక్షత్రాలలో మొదటిది స్త్రీ నక్షత్రం అయి, రెండవది పురుష నక్షత్రమైన వధూవరులకు వివాహం చేయరాదు.

జ్యేష్ఠ – శతభిష నక్షత్రాల వారికి వివాహం చేస్తే కుటుంబ హాని, మృగశిర –ఉత్తరాభాద్ర; హస్త – మూల నక్షత్రాల వాళ్ళకు వివాహం చేస్తే ప్రాణభీతి, సంపద నష్టం జరుగుతుంది.

విశాఖ –మఖ, విశాఖ – శ్రవణా నక్షత్రాల వారికి దంపతుల మధ్య శతృత్వం ఉంటుంది.

అశ్వని – శ్రవణం, ఉత్తరాభాద్ర – మృగశిర నక్షత్రాల వారికి వివాహం చేస్తే వైధవ్యం.
ఒకే రాశిలో ఉన్న రెండు నక్షత్రాల విషయంలో కృత్తిక 1 వ పాదం – భరణి; ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం; పుష్యమి – ఆశ్లేష నక్షత్రాలను విడిచి పెట్టాలి.

మూల – పూర్వాభాద్ర నక్షత్రాల వాళ్ళకు వివాహం చేస్తే అభివృద్ధి, పూర్వాషాడ –ఉత్తరాభాద్ర నక్షత్రాల వాళ్ళకు వివాహం చేస్తే అన్యోన్నత, భరణి – పుష్యమి నక్షత్రాల వాళ్ళకు వివాహం చేస్తే సౌభాగ్యం కలుగుతాయి. ఇందులో మొదటిది పురుష నక్షత్రంగాను, రెండవది స్త్రీ నక్షత్రంగా గ్రహించాలి.

ఆదివారం

 ఆదివారం పవిత్ర దినం, ఇకనైనా మేల్కొందాం! 

ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని ఓక శ్లోకం మీకోసం. 

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | 


సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||


స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |


న వ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి ||


💥తాత్పర్యం: 


మాంసం తినడం..! 

మద్యం తాగడం..!

స్త్రీతో సాంగత్యం..! 

క్షవరం చేసుకోవటం..!

తలకు నూనె పెట్టుకోవడం..!


ఇలాంటివి ఆదివారం నాడు  నిషేధించారు, 

కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..! 

ఈ కర్మలు చేసినవాడు  జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు 

అని నొక్కి చెప్పారు మన పెద్దలు దరిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం 

ఒక్కటే కాదు.. 

కుటుంబ సౌఖ్యం లేకపోవటం..

ఆనారోగ్యం కూడా..!!


ఇలాంటి పవిత్రమైనరోజు తాగుబోతులకి, 

తిండిపోతులకి 

ఇష్టమైన రోజు అయింది..!!


మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!


ఎందుకంటే.. 

అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. 

సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! 

సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!


అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!


ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!


ఇలాంటి ఆదివారం మనకి 

చాలా పవిత్రమైన రోజు.. 


అలాంటి ఆదివారాన్ని వీకెండ్ 

పేరుతో ఆదివారం సెలవు అనే 

పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! 

చేస్తున్నాము..!!


మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ..

ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!


అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు.. 

మన హిందువులే మన సంస్కృతిని

నాశనం చేసేలా చేశారు..!! ఆదివారం నాడు మన హిందూ 

దేవాలయాలు వెలవెల బోతాయి.!!


పూర్వకాలంలోవృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! 

ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!


మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. 

ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. 

మధ్యాన్ని తాగేవారు కాదు..!!


కానీ ఇప్పుడు సీన్ అంతా 

రివర్స్ అయ్యింది!!


ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.! 

ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! 

విదేశీ సంస్కృతిని విడనాడండి.! 

స్వదేశీ_సాంప్రదాయాలను పాటించండి..!


యోగ చేయండి.! 

ప్రాణాయామం చేయండి.! 

సూర్య_నమస్కారాలు చేయండి.!  

సూర్యోపాసన చేయండి.!! 

ఆయురారోగ్య ఐశ్వర్యాలను 

పొందండి..!!


ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! 

కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!

 సూర్యుడు కర్కాటక సంక్రమణం - దక్షిణాయన పుణ్యకాలం,ఈ రోజు నుండి దక్షిణాయన పుణ్యకాలం మొదలు.


జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు నవగ్రహాలకు రాజు.... అసలు జ్యోతిషంలో ఒక్క గ్రహం రాశి మారటానికి ఒక్కో కాల వ్యవధి వుంటుంది. అంటే చంద్రుడు మేష రాశి నుంచి వృషభరాశికి మారటానికి 2 1/2 రోజులు పడుతుంది. శనిగ్రహం 2 1/2 సం పడు తుంది. రాహు, కేతువులకి 1 1/2 సం, రవికి నెల రోజులు... ఇలా ప్రతి గ్రహానికి కొంత కాల పరిమితి వుంటుంది. అయితే ముఖ్యంగా సూర్యుడు నెలకి ఒక్కో రాశి చొన (మేషాది మీనరా శులు) పన్నెండు రాశులలోనూ పన్నెండు నెలలు సంచరిస్తే మనకి సంవత్సర కాలం పూర్త వుతుంది.


సూర్యుడు మేష రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మేష సంక్రమణం’ అని

సూర్యుడు వృషభ రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘వృషభ సంక్రమణం’ అని

సూర్యుడు మిథున రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘మిథున సంక్రమణం’ అని

సూర్యుడు కర్కాటక రాశి ప్రవేశాన్ని జ్యోతిష పరిభాషలో ‘కర్కాటక సంక్రమణం’ అని


ఇలా ఏయే రాశుల్లో ప్రవేశిస్తే ఆయా సంక్రమణ కాలంగా చెపుతారు. సంక్రమణం అనే మాటకి ‘జరగటం’, ‘ప్రవేశించటం’ అని చెప్పొచ్చు.


సూర్యుడు కర్కాటక సంక్రమణం చేసాడు అంటే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు అ ని అర్ధం. ఇది జూలై 15 నుంచి 17 తేది వరకు జరుగుతూ వుంటుంది. సాధారణంగా జూలై 16వ తేదీనే!


ఈ కర్కాటక సంక్రమణాన్ని ‘దక్షణాయన’ మని అంటుంటారు. (మనకి సంవత్సరానికి అయనములు రెండు. ఒకటి ఉత్తరాయనం, రెండవది దక్షిణాయనం) ఇక తర్వాత సూర్యుని సింహరాశి ప్రవేశం, తర్వాత కన్యా రాశి ప్రవేశం (వినాయక చవితి వస్తుంది), తులారాశి ప్రవేశం (దసరాలు). ఇలా పన్నెండు రాశులలోనూ సూర్యుడు ప్రవేశించే కాలా న్ని సంక్రమణంగా చెప్తాం. (మకర సంక్రమణం (సం క్రాంతి)... మకరరాశి ప్రవేశం! కుంభరాశి ప్రవేశం (మహాశివరాత్రి)) అయితే సూర్యుని మకర సంక్రమణ మే ‘ఉత్తరాయన పుణ్యకాలం’.


ఏ తిథులతోను సంబంధం లేకుండాను, ఎవరినీ అడగక్కర్లేకుండాను సంవత్సరంలో వచ్చే పండుగలు ఉత్తరాయణ-దక్షిణాయన మనేవి. జనవరి 14న వచ్చే ఉత్తరాయణాన్ని మకర సంక్రమణమనీ, జూలై 16న వచ్చే దక్షిణాయనాన్ని కర్కాటక సంక్రమణమనీ, వ్యవహరిస్తారు. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.


సూర్యుడు ప్రతి నెలలోను ఒక రాశినుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దీనికే ‘సంక్రమణం’ అని పేరు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పటినుంచి మకరరాశిలోకి ప్రవేశించేంతవరకు వుండే కాలం దక్షిణాయనం. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. ఈ రెండు ఆయనాల్లోనూ దక్షిణాయనాన్ని అపవిత్రంగాను, ఉత్తరాయణాన్ని పవిత్రంగాను భావిస్తారు. దేవతలకు ఉత్తరాయణం పగలు కాగా, దక్షిణాయనం రాత్రిగాను చెప్తారు. అదేవిధంగా ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని చెబుతారు. దక్షిణాయన సందర్భంగా సంక్రమణ స్నానాలు చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతోపాటు శ్రీ వరాహస్వామి వారిని పూజించడం శ్రేష్టమని చెప్తారు.


దక్షిణాయన ఆరంభ కాలమైన ఆషాఢంలో ఏ పండుగలు లేకపోయినా ఆ తర్వాత మాసాల్లో శ్రీకృష్ణాష్టమి, వినాయక చవితి, రాఖీపూర్ణిమ, ఆదిపరాశక్తి మహిమలను చాటే దసరా, నరక బాధలు తొలగించిన దీపావళి, శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక, మార్గశిర మాసాలు, గోపికలు ఆనంద పారవశ్యాన్ని పొందే ధనుర్మాసం ఇవన్నీ దక్షిణాయనంలోనే వస్తాయి. ఆషాఢమాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఖచ్చితంగా జరుగుతుంది. కర్కాటక రాశి ప్రవేశంతో దక్షిణాపథంవైపు సూర్యుడు పయనమవుతాడు. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృ దేవతలకు ఉత్తమమైనవి. దక్షిణాయనంలో చేసే పితృకర్మలు సరాసరి ఆ పితృదేవతలకు సకల నరకాలనుండి తొలగిస్తాయి.


దక్షిణాయనంలో దేవతా ప్రతిష్ఠ, గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహ కార్యాల్లాంటి శుభ కార్యాలను చేయడం మంచిది కాదంటారు. కానీ దక్షిణాయనంలో ఉగ్రదేవతా రూపాలను అంటే సప్త మాతృకలు, భైరవ, వరాహ, నృసింహ, మహిషాసుర మర్దని, దుర్గ లాంటి దేవతామూర్తులను ప్రతిష్టించవచ్చని వైఖానస సంహిత చెబుతోంది. కర్కాటక సంక్రమణ సమయంలో అంటే దక్షిణాయన ప్రారంభంలో పుణ్య స్నానాలు, జపతపాలు చేయడం ఎంతో మంచిది. ఆనాడు కులదైవాన్ని, లేదా శ్రీ మహా విష్ణువును పత్రాలతో పూజిస్తే ఆ ఏడాదంతా చేసే దోషాలు, పాపాలు వైదొలగుతాయి. వారి పితృదేవతలు స్వర్గాది సుఖలోకాలను చేరుకుంటారు.


సంక్రమణ కాలంలో చేసే పుణ్య స్నానాల వలన రోగాలు నివారించబడడమే కాకుండా దారిద్య్రం కూడా నిర్మూలించబడుతుంది. ముఖ్యంగా ఈ సంక్రమణ కాలం సాధకులకు మంచి ఆధ్యాత్మిక ఫలితాలనిస్తుంది. ఈ సమయంలో దానాలు కూడా విశేష ఫలాలనిస్తాయి. అందుకే మోక్షానికి ఉత్తరాయణం, ఇహానికి దక్షిణాయనం ప్రతీకలుగా భావిస్తారు. ఈరోజు పుణ్యనదీ స్నాన, దాన, జప, హోమం అక్షయ ఫలాన్ని ఇస్తుంది. మనందరము కూడా దక్షిణాయన సందర్భంగా మన ఆచార సంప్రదాయాలు పాటిద్దాం. భావి తరాలకు మన సంస్కృతిని తెలియజేద్దాం.

 🕉 శ్రీ గురుభ్యోనమః

ఆదివారం, జూలై 17, 2022

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం -   బహుళ పక్షం

తిథి:చవితి మ3.50 వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:శతభిషం సా6.58 వరకు

యోగం:సౌభాగ్యం రా11.53 వరకు

కరణం:బాలువ మ3.30 వరకు తదుపరి కౌలువ తె3.03 వరకు

వర్జ్యం:రా1.11 - 2.44

దుర్ముహూర్తం:సా4.50 - 5.42

అమృతకాలం:మ12.05 - 1.37

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:12.00 - 1.30

సూర్యరాశి:మిథునం

చంద్రరాశి: కుంభం

సూర్యోదయం:5.37

సూర్యాస్తమయం:6.34

కర్కాటక సంక్రమణం & దక్షిణాయన పుణ్యకాల ప్రారంభం ఉ10.57నుండి

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

 తల్లి దండ్రుల పాప పుణ్యాలు పిల్లలకు వస్తాయా.....!!

మనం ఒకోసారి వింటూ ఉంటాము... ఏ జన్మలో ఏ పాపం చేసానో... ఈ జన్మలో ఈ రోగం తో బాధ పడుతున్నాను.... ఏ జన్మలో ఏ పాపం చేసానో ఈ జన్మలో ఇలాంటి భర్త / భార్య దొరికాడు / దొరికింది.... తెలిసి నేను ఏ పాపమూ చెయ్య లేదు అయినా నా కెందుకీ శిక్ష వేసాడు దేవుడు.
ఇలాంటి మాటలు వింటూ ఉంటాము... మరి చెయ్యని పాపాలకు వాళ్ళు శిక్షలు ఎందుకు అనుభవిస్తున్నారు అంటే కారణం మూడు తరములనుండి వారికి ఆనువంశికంగా వస్తున్న పాప పుణ్యాలు అని చెప్పుకోవచ్చు.
తాను గత జన్మ లో చేసిన పాప పుణ్యాలు మాత్రమే కాదు; ఈ జన్మలో తన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు చేసిన పాప పుణ్యాలు కూడా జీవికి ఆనువంశికంగా వస్తాయి అనే చెబుతోంది ధర్మ శాస్త్రం.
కనిపించే ఆస్తి పాస్తులు; ధన - ధాన్యాలు; వస్తు - వాహనాలు ఎలాగో కనబడనివి పాప పుణ్యాలు. కనిపించే ఆస్తి పాస్తులు తర తరాలనుండి ఎలా సంక్రమిస్తున్నాయో కనబడని పాప పుణ్యాలు కూడా అలాగే సంక్రమిస్తాయి అని చెబుతోంది ధర్మ శాస్త్రం. వారి ఆస్తి మాకు వద్దు, వారి పాప పుణ్యాలు మాకు వద్దు అన్నంత మాత్రాన ఇవి పోవు. ఎందుకంటే ఈ శరీరమే తల్లిదండ్రులు, తాత ముత్తాతల ప్రసాదమైనప్పుదు ఈ శరీరానికి అంటిన ఆ పాపాలు అంత సులభంగా పోవు..
అలా పోవాలంటే ప్రస్తుత జన్మలో నిత్యం భగవన్నామ స్మరణ చేయాలి; ఉన్నంతలో ఇతరులకు సహాయ సహకారాలు చేయాలి. పుణ్య నదులలో స్నానాదులు చెయ్యాలి, తీర్ధ యాత్రలు చెయ్యాలి. చేసిన పాపాలకుపశ్చాత్తాపం చెందాలి. ప్రస్తుత తరం పాపాలు భవిష్యత్ తరాలకు సోకకుండా చూసుకోవాలి.