28, నవంబర్ 2023, మంగళవారం

జీవ ప్రజ్ఞ

 తాము చేస్తున్న కర్మలవలన మనుజుల గుణము బయటపడుతుంది. వ్యక్తిలో దాగివున్న సత్వ, రజో, తమో గుణములు కర్మలరూపంలో తేటతెల్లమవుతాయి. ఎంత కపటమును ప్రదర్శించినా కూడా అవి ఒకానొకప్పుడు బయటపడితీరుతాయి. అందుకే భగవతార్పణబుద్ధితో కర్మలనాచరించమని భగవద్గీత చెబుతుంది. ఎందుకంటే ఏదైనా భగవంతునికి అర్పించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటాము కాబట్టి. ఇలా చేయడంవలన మానవులు చేయు దుష్కర్మలు కొన్నాళ్ళకు సత్కర్మలుగా మారతాయి.

సత్కర్మల వలన శాంతి కలుగుతుంది. ఆ పిమ్మట సత్కర్మలను, నిష్కామకర్మలుగా(ఫలితమును ఆశింపక) చేయడం ద్వారా చిత్తశుద్ధి కలిగి జ్ఞానముదయిస్తుంది. చూడటానికి మాత్రం జ్ఞాని, అజ్ఞాని చేయుకర్మలు ఒకేలా వుంటాయి.
అజ్ఞాని, నేను చేస్తున్నానని భావించి(కర్తృత్యము), ఫలితముల యందు ఆసక్తితో కర్మలను చేసి, వాటి ఫలితాన్ని అనుభవించుటకు ఈ జన్మ చాలకపోతే ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు. కర్మఫలితాలతో బంధము ఏర్పడుతుంది.
జ్ఞాని, ఆత్మస్థితి యందుండి, ఎటువంటి ఫలితములను ఆశింపకా దైవబుద్ధితో కర్మలు చేస్తాడు. అది యజ్ఞంగా, యోగంగా మారి బంధమును కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానము పొంది బంధంనుండి విముక్తి పొందుతాడు.
ఈ కర్తృత్యమును మానవుడు అనవసరంగా తన నెత్తినవేసుకొని బాధపడుతున్నాడు. తను తెచ్చింది లేదు, వెంట తీసుకుపోతున్నది లేదు. ఈ అనంతకోటిబ్రహ్మాండమున మనుజుని ఉనికి యెంత! ఆయువు యెంత! తానూ పుట్టక మునుపు, మరణము పిమ్మట ఇది ఎవరిదో? అది ఎవరో తెలుసుకొనుటకు సాధనచేయాలి. అప్పుడు బ్రహ్మాండమును నడుపువాడు దైవమని తెలుస్తుంది.
అతడినే పరమాత్మ అన్నారు విజ్ఞులు. అతని ప్రమేయంతోనే విశ్వముదయించిది. అతని అంశయే ఈ చరాచర జగత్తు. మానవుడు కేవలం నిమిత్తమాత్రుడు. మనతో పనులు చేయుంచునదియు అతడే. అతడే సూత్రధారి. అనంత కాలమును, అనంత సృష్టిని అతడే నడుపుతున్నాడు. ఇక అరవై, డబై యేళ్లు జీవించే మానవుడు తానె అంతా చేస్తున్నానని అనుకోవడము హాస్యాస్పదము.
కావునా "నా ఆత్మయే నీవు", "నాచే చేయిస్తున్నది నీవు" అన్న సంకల్పంతో యుద్ధము చేయమని అర్జునునికి బోధించాడు శ్రీకృష్ణపరమాత్మ.
ఎవరి కర్మ శుద్ధముగా, పాపరహితముగా వుంటుందో అతడు ఎవరికీ భయపడ నవసరంలేదు. అందుకే మానవుడు ముందుగా నమస్కరించవలసినది కర్మకే (తస్మై నమః కర్మణే).
అంత అర్జునుడు, కృష్ణా! నాదొక సంశయము. బలవంతముగా మానవునిచేత కర్మలను చేయించేది ఏది? అని అడిగేడు.
అర్జునా! కామమే (కోరికలు) మనుజులచేత బలవంతంగా కర్మలను చేయిస్తుంది. కామము తీరకపోతే క్రోధంగా(కోపంగా) మారుతుంది. కామాన్నే క్రోధమని చెప్పవచ్చు. ఇదే మానవునికి మహాశత్రువు, మహాపాపకారి. ధూళి అద్దమును కప్పేసినటులు కోపము మనుజుని జ్ఞానాన్ని కమ్మేస్తుంది.కామానికి ఆధారములు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఇంద్రియముల కంటే బలీయమైనది మనస్సు. మనస్సు కంటే అత్యంత బలమైనది బుద్ధి.
కనుక అర్జునా! ఇంద్రియములను, మనస్సును అదుపులో పెట్టుకొని, బుద్ధితో ఆత్మను కనుగొని, జ్ఞానంతో పరమాత్మను చేరుకోవాలని బోధించాడు జగద్గురువు...

29.11.2023 పంచాంగం

 

ఓం శ్రీగురుభ్యో నమః
బుధవారం, నవంబరు 29,2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
కార్తీక మాసం - బహళ పక్షం
తిథి:విదియ మ3.38 వరకు
వారం:బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం:మృగశిర మ2.29 వరకు
యోగం:సాధ్యం రా10.10 వరకు
కరణం:గరజి మ3.38 వరకు తదుపరి వణిజ రా1.52 వరకు
వర్జ్యం:రా11.16 - 12.56
దుర్ముహూర్తము:మ11.25 - 12.10
అమృతకాలం:ఉ7.05వరకు &
తె5.06నుండి
రాహుకాలం:మ12.00 - 1.30
యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:మిథునం
సూర్యోదయం:6.16
సూర్యాస్తమయం:5.20
సర్వేజనా సుఖినో భవంతు

 శ్రీ గురుభ్యోనమః

మంగళవారం, నవంబరు 28,2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి మ1.40 వరకు

వారం:మంగళవారం (భౌమవాసరే)

నక్షత్రం:రోహిణి మ1.55 వరకు  

యోగం:సిద్ధం రా11.14 వరకు

కరణం:కౌలువ మ1.40 వరకు తదుపరి తైతుల రా1.39 వరకు

వర్జ్యం:ఉ.శే.వ7.29వరకు & రా7.38 - 9.17

దుర్ముహూర్తము:ఉ8.28 - 9.13 &

మ10.30 - 11.22

అమృతకాలం:ఉ10.42 - 12.18 &

తె5.27నుండి

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30

సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:వృషభం

సూర్యోదయం:6.15

సూర్యాస్తమయం: 5.20

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

27, నవంబర్ 2023, సోమవారం

 

జననకాల నక్షత్ర దోషాలు


పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది. ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ దోషములు కలుగు తాయి దోష పరిహారములు ఏమిటి ? దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవ గ్రహ శాంతి, హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభిషేకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి.

1. అశ్విని 1 వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము 3 నెలలు ఉండును. ఇక్కడ గమనించ వలసిన విషయము రేవతి, అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషములు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు.

2. భరణి 1 2 4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 దినముల వరకు ఉంటుంది.

3. కృత్తిక నక్షత్రములో 3 వ పాదములో జన్మంచిన స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగ చేయును. 1 2 4 పాదములలో జన్మంచిన వారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు.

4. రోహిణి నక్షత్రము 1 వ పాదములో జన్మించిన మేనమామకు, 2 వ పాదము తండ్రికి, 3 వ పాదము తల్లికి దోషమని 4 వ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము. సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టడం వలన మేనమామకు గండము. తప్పక శాంతి అవసరము . శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు . అందు వలననే కంసుడు నాశనమయ్యాడనీ పురాణ వచనము.

5. మృగశిర 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు.

6. ఆరుద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జన్మంచిన వారికి దోషము లేదు 4 వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము.

7. పునర్వసు నక్షత్రము 1 2 3 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.

8. పుష్యమి నక్షత్రము కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును. రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. పుష్యమి నక్షత్రములో జన్మించిన వారివలన 1 వ పాదము మేనమామలకు 2 పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు. మూడు, నాల్గవ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును. వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి.

9. ఆశ్లేష నక్షత్రములో 1 వ పాదమున పుట్టినవారికి దోషము లేదు. 2 వ పాదము శిశువునకు 3 వ పాదము తల్లికి, 4 వ పాదము తండ్రికి దోషము. నాలుగవ పాదము న జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును.

10. మఖ నక్షత్ర 1 వ పాదములో జననమైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము. 3 వ పాదమున పుట్టిన వారి వలన తల్లి తండ్రి ఇద్దరకి దోషము. 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు.

11. పుబ్బ నక్షత్రములో 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

12. ఉత్తర నక్షత్ర 1, 4 వ పాదములలో జననము జరిగిన యెడల తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. మిగతా 2 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు.

13. హస్తా నక్షత్ర 3 వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1 2 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.

14. చిత్త నక్షత్రములో 1 వ పాదము తండ్రికి, 2 వ పాదము తల్లికి 3 వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును.

15. స్వాతి నక్షత్రమున 1 2 3 4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు.

16. విశాఖ నక్షత్రము జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును. 1 2 3 4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము. విశేష శాంతి అవసరము.

17. అనూరాధ నక్షత్రము 1 2 3 4 పాదములలో జన్మించుట వలన దోషము లేదు.

18 . జ్యేష్ట నక్షత్రము ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1 2 3 4 ఏ పాదములో జన్మించినా దోషమే. జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి. అందులో ఏ భాగములో పుడితే ఆ భాగ సంబందము కలవారికి తప్పక నాశనము కలుగును.1 వ భాగములో తాతయ్యకు, 2 అమ్మమ్మకు, 3 తల్లి తోడ బుట్టిన వారికి, మేనమామలకు 4 అన్నలకు, అక్కలకు 5 శిశువునకు, 6 ఎవ్వరికి దోషము ఉండదు, 7 వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు, 8 జాతకునకు, 9 తల్లికి, 10 తండ్రికి దోషము కలుగ చేయును. మరియు నాల్గవ పాదమున జననమైతే తండ్రికి దోషము. ఇది సమారు 9 నెలలు ఉండును. విశేష శాంతి చేయించాలి .

19. మూల నక్షత్రము ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండును. ఈ నక్షత్రములో 1 వ పాదమున జనన మయిన వారి తండ్రికి, 2 వ పాదము తల్లికి, 3 వ పాదము ధనమునకు నాశనము కల్గించును, 4 వ పాదమున జననము జరిగిన దోషము లేదు. మూలా నక్షత్ర సమయమును మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసు కోవాలి.

పన్నెండు భాగాలలో1 వ భాగము తండ్రికి దోషము, 2 తల్లికి, 3 అన్నలకు, 4 భాగస్వాములకు, 5 పిల్లనిచ్చిన మామగారికి, 6 చిన్నాన్న, పెద్ద నాన్నలకు 7 పిన్నమ్మ, పెద్దమ్మలకు మరియు మేనమామలకు. 8 ధనమునకు, 9 జీవన నాశనము, 10 దరిద్రమును కల్గిస్తుంది, 11 భ్రుత్యులు, 12 జాతకునికి నాశనము కలుగ చేయును.జ్యేష్ట ,మూలా నక్షత్రములలో జన్మించిన వారి దోషము వివాహ కాలము వరకు ఉండును. నవ గ్రహ శాంతి, జప, తప, దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును.

20. పూర్వాషాడ నక్షత్రము పగటి వేళలో కుమారుడు జన్మించినపుడు తండ్రికి ఆపదలు కలుగును. 2 , 3 వ పాదములలో స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టిననూ తల్లి తండ్రి ఇద్దరికీ గండము. 4 వ పాదమున జననము దోషము లేదు.

21. ఉత్తరాషాడ నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

22. శ్రవణం నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

23. ధనిష్ట నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

24. శతభిషం నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

25. పూర్వాబాద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు. నాల్గవ పాదము సామాన్య దోషము .

26. ఉత్తరాభాద్ర నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.

27. రేవతి నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు. 4 వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి.

* ఈ నక్షత్రములనే కాక ప్రేగులు మేడలో వేసుకుని పుట్టిన, కాళ్ళు మొదట బయటకు వస్తు జననం జరిగినా, దుష్ట తిధి దోషము, వర్జ్యము, దుర్ముహూర్త కాలముల యందునూ, గ్రహణ సమయములలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట మఖ్యము.

* జన్మ పత్రిక ఎప్పుడు వ్రాయించుకోవాలి:- శిశువు జన్మించిన తర్వాత 'పురుడు' అయిన తరవాత జన్మ పత్రిక వ్రాయించుకుని దోషాలు ఏమైనా ఉన్నాయో జ్యోతిష పండితుని అడిగి తెలుసుకుని... శిశువు పుట్టిన 27 రోజుల లోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురౌతుంటాయి. సాధ్యమైనంత తొందరలో జరిపించుకోవడం ఉత్తమం.శిశువు 12 సం.రాలు దాటిన తర్వాత ద్వాదశ భావ ఫలితాలు గురించి తెలుసుకోవాలి.

* శిశువుకు 16 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత సంపూర్ణ జాతక విషయాలను అడిగి తెలుసుకోవాలి.

* అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుడిని సంప్రదించి జాతక చక్రం వేయించుకుని జాతక ఫలితాలు తెలుసుకున్నాకా పండితుడికి స్వయం పాకం, దక్షిణ, పండ్లు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.

 

మనో నిగ్రహమును సాధించుట ఎట్లు


మనస్సును గమనించుచుండగా అందు 'భావములు' పుట్టుచున్నవి. వానిని పట్టినచో వాని వెంటబడి పోవుటయే గాని, మనస్సును పట్టుట జరుగదు. భావముల వెంట బోయినచో నేకాగ్రత కలుగదు.


చీకటిలో టార్చిలైటును వెలిగించి ఆ వెలుగు పొడవైపునకు చూచుచున్నచో, ఆ పొడవు పోను పోను విశాలమై, కిరణములు అధికసంఖ్యాకములై వికాసము తగ్గును.
అట్లుకాక రెండవవైపునకు చూచుచుండవలెను. కిరణముల 'ఉత్పత్తి స్థానము'నకు మనసును ప్రసరింప జేయవలెను. దానినే 'బుద్ధి' యందురు. బుద్ధితో మనసును పట్టవలెనే గాని మనసును గూర్చిన భావములతో కాదు.
మనస్సున భావము లెట్లు ఉద్భవించుచున్నవో గమనింపవలెను. లోకములు భగవంతునియందు అట్లే యుద్భవించుచున్నవని తెలియవలెను. భావములు ఉద్భవించు 'తావును' గమనించుచు భావములను గమనింపకుండవలెను.

దీనితో భావము లుద్భవించుట మానును. మెల్లమెల్లగా నదే ప్రయత్నము మరల మరల చేయవలెను. అపుడు పట్టు చిక్కును. తన్ను తాను పట్టుకొనుట యారంభమగును. దీనినే 'ధృతి' యందురు.

సమాధి మనిషికి సహజస్థితి. మెలకువ, స్వప్నం, సుషుప్తి - వీటన్నిటికీ నేపధ్యమదే. ఈ మూడు అవస్థల్లోనూ ఆత్మలేదు. కానీ ఆ మూడూ ఆత్మలో ఉన్నాయి. మెలకువగా ఉన్నప్పుడు సమాధి కలిగితే, అదే సుషుప్తిలో కూడా కొనసాగుతుంది. ఎరుక కలిగి ఉండటం, లేకపోవడం - మనస్సుకి సంబంధించిన అవస్థలు. ఆత్మ వీటికి అతీతం !

పరిపక్వం చెందిన సాధక హృదయంలో మనసు పూర్తిగా నిమజ్జనమైనప్పుడు, అనంతమైన వ్యాప్తి గల తురీయాతీతస్థితి [అంటే నాలుగు అవస్థలకూ అతీతమైన ఆత్మ] అకస్మాత్తుగా ప్రకాశిస్తుంది. ఒక స్వచ్ఛమైన నూతనానుభూతి వలె - అదే అపురూపమైన శివలోకప్రాప్తి. అదే ఆత్మతేజంలో భాసిల్లుతుంది

నమ్మకం అనేది తెలియని వాటిల్లోనే ఉంటుంది. కానీ ఆత్మ స్వయం విదితం. నమ్మకము, ప్రేమ మన సహజలక్షణాలు !!*_
ప్ర.: నాకు ఆత్మపై ఏకాగ్రతని సాధించటం కొన్నిసార్లు తేలికగా మరియు ఇతర సమయాల్లో అమిత కష్టంగా ఉంటుంది?
భగవాన్ : అది సంస్కారాల (వాసనల) వలన. కానీ నిజంగా ఏకాగ్రత సాధించడం చాలా సులభం, ఎందుకంటే మనం ఆత్మే కనుక. అయితే మనం చేయాల్సిందల్లా ఈ విషయం సదా గుర్తుంచుకోవడమే. మనం దానిని మరచిపోతూనే ఉంటాము, తద్వారా మనం ఈ శరీరం లేదా ఈ అహం అని అనుకుంటాము. తనను తాను గుర్తుంచుకోవాలనే సంకల్పం మరియు కోరిక తగినంత బలంగా ఉంటే, చివరికి వాసనలను అధిగమించడం సులభతరం అవుతుంది.ఆత్మ సాక్షాత్కరించేంత వరకు అంతరంగంలో ఎప్పుడూ ఒక గొప్ప యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధం దేవతలకు మరియు రాక్షసులకు మధ్య జరిగిన పోరాటంగా ఇతిహాసాలలో ప్రతీకాత్మకంగా చెప్పబడింది.
                                                                                                    భగవాన్ శ్రీ రమణ మహర్షి...

సాధకుడు భూతకాలికమైన ఆలోచనకు, భవిష్యత్కాలికమైన ఆలోచనకు మధ్యనున్న వర్తమానమును అత్యంత జగరూకమైన బుద్ధితో గమనించుచు అవిచ్ఛిన్నమైన ఆలోచనాప్రవాహమునందు ప్రజ్ఞానఘనమై అఖండ వర్తమానమైన అంతర్వృత్తి పరబ్రహ్మమనియే తనయందు సాక్షాత్కరించుకొనును. ఇట్లు కాలతత్త్వానుసంధానము ద్వారా స్వరూపనిష్ఠ తెలుపబడినది..

మనస్సుని ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం చేసి, భగవంతుని యందే స్థితం చేయటానికి అభ్యాసం చేస్తున్న యోగికి ఆవేశ-ఉద్వేగాలు శాంతిస్తాయి మరియు మనస్సు పరమ శాంతిని పొందుతుంది. ఇంతకు ముందు భగవంతుని యందు నిలపటానికి పరిశ్రమించవలసి వచ్చేది, కానీ ఇప్పుడు సహజంగానే ఆయన వద్దకు పరుగు తీస్తుంది. ఈ స్థితిలో, ఉన్నతమైన ధ్యానపరుడు అన్నింటినీ భగవత్ సంబంధముగా చూస్తాడు.

నారద మహర్షి ఇలా పేర్కొన్నాడు:
తత్ ప్రాప్ర్య తద్ ఏవావలోకయతి తద్ ఏవ శృణోతి
తద్ ఏవ భాషయతి తద్ ఏవ చింతయతి (నారద భక్తి దర్శన్, 55వ సూత్రము)

“ఎల్లప్పుడూ భగవంతుని యందే ప్రేమతో మనస్సుని ఏకం చేసిన భక్తుని అంతఃకరణ ఆయన యందే నిమగ్నమైఉంటుంది. అటువంటి భక్తుడు ఎల్లప్పుడూ ఆయననే చూస్తుంటాడు, ఆయన గురించే మాట్లాడుతాడు మరియు ఆలోచిస్తుంటాడు.” ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా నిమగ్నమవుతుందో, ఆత్మ తనలో కూర్చుని ఉన్న భగవంతుని అనంతమైన ఆనందాన్ని రుచి చూడటం ప్రారంభిస్తుంది.

సాధకులు తరచుగా అడుగుతుంటారు, తాము ఎంత పురోగమిస్తున్నామో ఎలా తెలుసు కోవాలి అని. దీనికి సమాధానం ఈ శ్లోకం లోనే నిక్షిప్తమై ఉంది. మన అంతర్గత అలౌకిక ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు, అది, మన మనస్సు నియంత్రించబడుతుండటానికి మరియు మన అంతఃకరణ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నదనుకోవటానికి ఒక నిదర్శనం. ఇక్కడ, మనము 'శాంత-రాజసం' (free from passion) మరియు 'అకల్మశం' (పాప రహితం) అయినప్పుడు మనము 'బ్రహ్మ-భూతం' (భగవత్ ప్రాప్తి) పొందుతాము అని, శ్రీ కృష్ణులవారు అంటున్నారు.

                        श्लो.    प्रशान्त मनसं ह्येनं योगिनं सुखमुत्तमं
                                   उपैति शान्तराजसं ब्रह्म भूतमकल्षषम्

ఆ స్థితిలో, మనము ‘సుఖం ఉత్తమం’ (అత్యున్నత ఆనందము) అనుభవిస్తాము. భగవద్గీత 6.27..

 కార్తీక దీపారాధన శ్లోకము..


కీటా: పతంగా: మశకాశ్చ  వృక్షా:

జలే స్థలే యే నివసన్తి జీవా:

దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగిన:

భవంతి త్వం శ్వపచాహి విప్రా:||


దీప దాన శ్లోకము  :


సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ శుభావహం!

దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ !!!..