మనో నిగ్రహమును సాధించుట ఎట్లు
మనస్సును గమనించుచుండగా అందు 'భావములు' పుట్టుచున్నవి. వానిని పట్టినచో వాని వెంటబడి పోవుటయే గాని, మనస్సును పట్టుట జరుగదు. భావముల వెంట బోయినచో నేకాగ్రత కలుగదు.
చీకటిలో టార్చిలైటును వెలిగించి ఆ వెలుగు పొడవైపునకు చూచుచున్నచో, ఆ పొడవు పోను పోను విశాలమై, కిరణములు అధికసంఖ్యాకములై వికాసము తగ్గును.
అట్లుకాక రెండవవైపునకు చూచుచుండవలెను. కిరణముల 'ఉత్పత్తి స్థానము'నకు మనసును ప్రసరింప జేయవలెను. దానినే 'బుద్ధి' యందురు. బుద్ధితో మనసును పట్టవలెనే గాని మనసును గూర్చిన భావములతో కాదు.
మనస్సున భావము లెట్లు ఉద్భవించుచున్నవో గమనింపవలెను. లోకములు భగవంతునియందు అట్లే యుద్భవించుచున్నవని తెలియవలెను. భావములు ఉద్భవించు 'తావును' గమనించుచు భావములను గమనింపకుండవలెను.
దీనితో భావము లుద్భవించుట మానును. మెల్లమెల్లగా నదే ప్రయత్నము మరల మరల చేయవలెను. అపుడు పట్టు చిక్కును. తన్ను తాను పట్టుకొనుట యారంభమగును. దీనినే 'ధృతి' యందురు.
సమాధి మనిషికి సహజస్థితి. మెలకువ, స్వప్నం, సుషుప్తి - వీటన్నిటికీ నేపధ్యమదే. ఈ మూడు అవస్థల్లోనూ ఆత్మలేదు. కానీ ఆ మూడూ ఆత్మలో ఉన్నాయి. మెలకువగా ఉన్నప్పుడు సమాధి కలిగితే, అదే సుషుప్తిలో కూడా కొనసాగుతుంది. ఎరుక కలిగి ఉండటం, లేకపోవడం - మనస్సుకి సంబంధించిన అవస్థలు. ఆత్మ వీటికి అతీతం !
పరిపక్వం చెందిన సాధక హృదయంలో మనసు పూర్తిగా నిమజ్జనమైనప్పుడు, అనంతమైన వ్యాప్తి గల తురీయాతీతస్థితి [అంటే నాలుగు అవస్థలకూ అతీతమైన ఆత్మ] అకస్మాత్తుగా ప్రకాశిస్తుంది. ఒక స్వచ్ఛమైన నూతనానుభూతి వలె - అదే అపురూపమైన శివలోకప్రాప్తి. అదే ఆత్మతేజంలో భాసిల్లుతుంది
నమ్మకం అనేది తెలియని వాటిల్లోనే ఉంటుంది. కానీ ఆత్మ స్వయం విదితం. నమ్మకము, ప్రేమ మన సహజలక్షణాలు !!*_
ప్ర.: నాకు ఆత్మపై ఏకాగ్రతని సాధించటం కొన్నిసార్లు తేలికగా మరియు ఇతర సమయాల్లో అమిత కష్టంగా ఉంటుంది?
భగవాన్ : అది సంస్కారాల (వాసనల) వలన. కానీ నిజంగా ఏకాగ్రత సాధించడం చాలా సులభం, ఎందుకంటే మనం ఆత్మే కనుక. అయితే మనం చేయాల్సిందల్లా ఈ విషయం సదా గుర్తుంచుకోవడమే. మనం దానిని మరచిపోతూనే ఉంటాము, తద్వారా మనం ఈ శరీరం లేదా ఈ అహం అని అనుకుంటాము. తనను తాను గుర్తుంచుకోవాలనే సంకల్పం మరియు కోరిక తగినంత బలంగా ఉంటే, చివరికి వాసనలను అధిగమించడం సులభతరం అవుతుంది.ఆత్మ సాక్షాత్కరించేంత వరకు అంతరంగంలో ఎప్పుడూ ఒక గొప్ప యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ యుద్ధం దేవతలకు మరియు రాక్షసులకు మధ్య జరిగిన పోరాటంగా ఇతిహాసాలలో ప్రతీకాత్మకంగా చెప్పబడింది.
భగవాన్ శ్రీ రమణ మహర్షి...
సాధకుడు భూతకాలికమైన ఆలోచనకు, భవిష్యత్కాలికమైన ఆలోచనకు మధ్యనున్న వర్తమానమును అత్యంత జగరూకమైన బుద్ధితో గమనించుచు అవిచ్ఛిన్నమైన ఆలోచనాప్రవాహమునందు ప్రజ్ఞానఘనమై అఖండ వర్తమానమైన అంతర్వృత్తి పరబ్రహ్మమనియే తనయందు సాక్షాత్కరించుకొనును. ఇట్లు కాలతత్త్వానుసంధానము ద్వారా స్వరూపనిష్ఠ తెలుపబడినది..
మనస్సుని ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం చేసి, భగవంతుని యందే స్థితం చేయటానికి అభ్యాసం చేస్తున్న యోగికి ఆవేశ-ఉద్వేగాలు శాంతిస్తాయి మరియు మనస్సు పరమ శాంతిని పొందుతుంది. ఇంతకు ముందు భగవంతుని యందు నిలపటానికి పరిశ్రమించవలసి వచ్చేది, కానీ ఇప్పుడు సహజంగానే ఆయన వద్దకు పరుగు తీస్తుంది. ఈ స్థితిలో, ఉన్నతమైన ధ్యానపరుడు అన్నింటినీ భగవత్ సంబంధముగా చూస్తాడు.
నారద మహర్షి ఇలా పేర్కొన్నాడు:
తత్ ప్రాప్ర్య తద్ ఏవావలోకయతి తద్ ఏవ శృణోతి
తద్ ఏవ భాషయతి తద్ ఏవ చింతయతి (నారద భక్తి దర్శన్, 55వ సూత్రము)
“ఎల్లప్పుడూ భగవంతుని యందే ప్రేమతో మనస్సుని ఏకం చేసిన భక్తుని అంతఃకరణ ఆయన యందే నిమగ్నమైఉంటుంది. అటువంటి భక్తుడు ఎల్లప్పుడూ ఆయననే చూస్తుంటాడు, ఆయన గురించే మాట్లాడుతాడు మరియు ఆలోచిస్తుంటాడు.” ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా నిమగ్నమవుతుందో, ఆత్మ తనలో కూర్చుని ఉన్న భగవంతుని అనంతమైన ఆనందాన్ని రుచి చూడటం ప్రారంభిస్తుంది.
సాధకులు తరచుగా అడుగుతుంటారు, తాము ఎంత పురోగమిస్తున్నామో ఎలా తెలుసు కోవాలి అని. దీనికి సమాధానం ఈ శ్లోకం లోనే నిక్షిప్తమై ఉంది. మన అంతర్గత అలౌకిక ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు, అది, మన మనస్సు నియంత్రించబడుతుండటానికి మరియు మన అంతఃకరణ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నదనుకోవటానికి ఒక నిదర్శనం. ఇక్కడ, మనము 'శాంత-రాజసం' (free from passion) మరియు 'అకల్మశం' (పాప రహితం) అయినప్పుడు మనము 'బ్రహ్మ-భూతం' (భగవత్ ప్రాప్తి) పొందుతాము అని, శ్రీ కృష్ణులవారు అంటున్నారు.
श्लो. प्रशान्त मनसं ह्येनं योगिनं सुखमुत्तमं
उपैति शान्तराजसं ब्रह्म भूतमकल्षषम्
ఆ స్థితిలో, మనము ‘సుఖం ఉత్తమం’ (అత్యున్నత ఆనందము) అనుభవిస్తాము. భగవద్గీత 6.27..